నేడు బ్రాహ్మణ కార్తీక వన భోజనం
1 min read

కర్నూలు , న్యూస్ నేడు: కర్నూలు నగరం సంకల్ భాగ్లోని హరిహర క్షేత్రం వెలిసిన శ్రీ దేవి భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయంలో ఆదివారం కర్నూలు నగర బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో కార్తీక వన భోజన మహోత్సవం నిర్వహిస్తున్నట్లు కర్నూలు నగర బ్రాహ్మణ సంఘం జజిల్లా అధ్యక్షుడు సండేల్ చంద్ర శేఖర్ తెలిపారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఉదయం స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు, మధ్యాహ్నం 1 గంటకు కార్తీక వన భోజనం ఉటుందని పేర్కొన్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లా బ్రాహ్మణ కుటుంబీకులందరూ కార్తీక వన భోజన మహోత్సవంలో పాల్గొనాలని ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు సండేల్ చంద్ర శేఖర్ కోరారు.

