NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పద్మశాలియులు రాజకీయాల్లో రాణించాలి

1 min read

మాజీ ఎంపీ  డా. సంజీవ్​ కుమార్​

  • 17వ కార్తీక వన భోజన మహోత్సవం విజయవంతం

కర్నూలు​ , న్యూస్​ నేడు: పద్మశాలి యువత రాజకీయాల్లో రాణించాలని పిలుపునిచ్చారు మాజీ ఎంపీ డా. సంజీవ్​ కుమార్​.  ఆదివారం  17వ పద్మశాలి కార్తీక వన భోజన మహోత్సవాన్ని పద్మశాలి సంఘం నగర అధ్యక్షుడు కస్తూరి వేమయ్య అధ్యక్షతన ఘనంగా జరిగింది.  ఉదయం ఉసిరి చెట్టుకు పూజలు చేసిన అనంతరం… ప్రారంభమైన సభలో ప్రముఖులు పాల్గొని మాట్లాడారు. పద్మశాలియులు ఐక్యతతో మెలిగి…రాజకీయ, సామాజిక , విద్య, వైద్య రంగాల్లో రాణించాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేనేతలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నాయని, ప్రత్యేక పథకాలు, ప్రోత్సహకాలను సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్నారు. వివిధ రంగాల్లో స్థిర పడిన పద్మశాలియులు పేదలను ఆదుకోవాలన్నారు.

లక్ష్య సాధనకు కృషి చేయండి…

విద్యార్థి దశ నుంచే లక్ష్య సాధనకు కృషి చేయాలని రాయలసీమ యూనివర్శిటీ వైస్​ ఛాన్సలర్​ బసవరావు సూచించారు.  ప్రతి ఒక్కరూ తాము ఎంచుకున్న రంగంలో రాణించేందుకు పట్టుదల, ఏకాగ్రత, శ్రద్ధ, క్రమ శిక్షణతో రాణించాలన్నారు.  త్రిబుల్​ ఐటీ, నీట్​లో ఉత్తమ ర్యాంకులు సాధించిన వారికి అభినందనలు తెలియజేశారు.

ప్రముఖులకు  ఘనసన్మానం

ప్రభుత్వ,  ప్రైవేటు రంగాల్లో స్థిర పడిన పద్మశాలియులు, పెద్దలను కుల పెద్దల నేతృత్వంలో ఘనంగా సన్మానించారు.  రాయలసీమ యూనివర్శిటీ వైస్​ ఛాన్సలర్​ బసవరావు , ప్రముఖులు డా. ధనుంజయ ను పద్మశాలి సంఘం నగర అధ్యక్షుడు కస్తూరి వేమయ్య, ప్రధాన కార్యదర్శి మేడం సుంకన్న,  కోశాధికారి గుర్రం శివ ప్రసాద్​, సభ్యులు జేరుబండి హరి ప్రసాద్​ తదితరులు శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. అలాగే  ఉన్నత విద్యలో అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను సన్మానించారు.

అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు

భూదేవి,శ్రీదేవి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి వేషధారణలో చిన్నారులు హేమంత్​ కుమార్​, వర్షిక, దీక్షిత వేసిన నాట్యం అద్భుతంగా ఉందని ప్రముఖులు ప్రశంసించారు. ఆ తరువాత చిన్నారులు వివిధ పాటలకు వేసిన డ్యాన్సులు చూపరులను  ఆకట్టుకున్నాయి.

కార్తీక భోజనం.. విజయవంతం..

పద్మశాలి సంఘం నగర అధ్యక్షుడు కస్తూరి వేమయ్య అధ్యక్షతన జరిగి న పద్మశాలియుల 17వ కార్తీక వన భోజన మహోత్సవం విజయవంతమైంది.  కార్యక్రమానికి దాదాపు 3 వేల మంది జనాభా రాగా… కుల బాంధవులుందరికీ భోజనాలు, వసతులు ఏర్పాటు చేశారు. గత పదైదు రోజులుగా పద్మశాలి సంఘం నగర కమిటీ సభ్యులు కుల బాంధువులను పిలిచి… కార్యక్రమానికి రప్పించడంలో సక్సెస్​ అయ్యారని ప్రముఖులు అభినందించారు.

About Author