NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

బ్రాహ్మణులు ఆర్థికంగా ఎదగాలి

1 min read

అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల దిశగా ముందడుగు వేద్దాం

  • ఏపీ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు కోనూరు సతీష్ శర్మ

కర్నూలు , న్యూస్​ నేడు: నిరుపేద వర్గాలకు చెందిన బ్రాహ్మణుల పురోభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల నిర్వహణ దిశగా ముందడుగు వేద్దామని, సమాఖ్యను జిల్లా, నియోజిక వర్గ స్థాయిల్లో మరింత బలోపేతం చేసి, సమష్టి కార్యాచరణ కార్యక్రమాలతో అభివృద్ధి పథంలో సాగుదామని ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు కోనూరు సతీష్ శర్మ పిలుపు నిచ్చారు. మంగళవారం కర్నూలులోని పెద్దమార్కెట్ సమీపంలోగల శ్రీలక్ష్మీ నరసింహాస్వామి కల్యాణ మండపంలో ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య బైలా ఎమెండ్మెంట్ ఎక్స్ట్రార్డినరీ జనరల బాడీ మీటింగు, రాష్ట్ర అధ్యక్షులు కోనూరు సతీష్ శర్మ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో సమాఖ్య పూర్వ అధ్యక్షుడు కేవీఎల్ఎన్ రామచంద్రమూర్తి ప్రవేశ పెట్టిన పలు తీర్మానాలను ఏకగ్రీవంగా ఆమోదించారు. ఈ సందర్భంగా కోనూరు సతీష్ శర్మ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చందబ్రాబు, విద్యామంత్రి లోకేశ్ బాబులతో చర్చించి  రాబోయే కాలంలో ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల భాగస్వామ్యంతో నిరుద్యోగులైన బ్రాహ్మణ యువతకు జాబ్ మేళాలు రాష్ట్రమంతటా నిర్వహిస్తామని తెలిపారు. అలాగే బ్రాహ్మణ మహిళా సాధికారతకు కుట్టు శిక్షణల తోపాటూ ఇతర ఉపాధి రంగాల్లోనూ, చిన్నచిన్న పరిశ్రమల స్థాపనకు ప్రోత్సహిస్తామని తెలిపారు. సమాఖ్యకు సుధీర్ఘ చరిత్ర ఉందని, 42 ఏళ్లుగా సేవలు అందిస్తోందని గుర్తు చేశారు. సమాఖ్యలోని గాయత్రి విద్యా సేవా ట్రస్టు, గాయత్రి విద్యార్థి పథకం, కొనసాగిస్తూ బ్రాహ్మణ విద్యార్థులకు ఉన్నత చదువులకు కృషి చేస్తామని తెలిపారు.

యువజన విభాగానికి అధ్యక్షుల ఎంపిక..

ఈ సందర్భంగా సమాఖ్య యువజన విభాగానికి అధ్యక్షులుగా రాయలసీమ జిల్లాల నుంచీ కరణం నవీన కుమార్ను, ఆర్గనైజింగ్ కార్యదర్శిగా ఉత్తరాంధ్ర జిల్లాల నుంచీ మందా రవిని ఎంపిక చేసి బాధ్యతలు అప్పగించారు. ఈ కార్యక్రమంలో జాబ్మేళా కన్వీనర్ అయ్యప్ప శర్మ, జిల్లా పత్రినిధులు కేసీ కల్కూర, హెచ్కి రాజశేఖర్ రావు, కళ్లే చంద్రశేఖర్ శర్మ, మహిళా విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు గాయత్రిలతోపాటూ వివిధ జిల్లాల నుంచి వచ్చిన సమాఖ్య జిల్లాల ప్రతినిధులు ప్రసంగించారు.

శాలువాలు.. జ్ఞాపికతో ఘన సన్మానం..

సమాఖ్యలో ముఖ్య భూమిక పోషిస్తున్న ప్రతినిధులను, వివిధ జిల్లాల సమాఖ్య బాధ్యలను, కొత్తగా వివిధ పదవులకు ఎంపికైన వారికి జ్ఞాపికలు అందజేసి, శాలువలతో ఘనంగా సత్కరించారు. సభా కార్యక్రమానికి ముందు సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు కోనూరు సతీష్ శర్మలతోపాటూ పరువులు రాష్ట్ర నాయకులు పాతనగరంలోని జిల్లా కేంద్ర గ్రంధాలయంలోగల స్వాంతత్ర్య సమరయోధుడు, జిల్లాకు చెందిన గాడిచర్ల హరిసర్వోత్తమరావు విగ్రహానికి పుష్పమాలలు వేసి నివాళులు అర్పించారు.

About Author