దివ్యాంగులు ‘ సివిల్స్’ లో రాణించాలి
1 min read

రిటైర్డు ఐఏఎస్ బాల లత
కర్నూలు, న్యూస్ నేడు:విభిన్న ప్రతిభావంతులు ఎందులోనూ తక్కువ కాదని, దివ్యాంగులు సివిల్స్ రాణించాలని పిలుపునిచ్చారు వాలంటరీ రిటైర్డు ఐ ఏఎస్ బాల లత. సోమవారం నగరంలోని సిల్వర్ జూబ్లీ కళాశాలలో సివిల్స్, ఐఏఎస్ పై విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రిటైర్డు ఐఏఎస్ బాలలత మాట్లాడుతూ ఉన్నత చదువులు చదివితే భవిష్యత్ బంగారుమయంగా ఉంటుందన్నారు. పేద, మధ్య తరగతి కుటుంబాలకు చెందిన యువతీ యువకులు ఉన్నత చదువులు చదవలేక ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారని, అందులో దివ్యాంగులు మరింత అవస్థలు పడుతున్నారని, అలాంటి వారి కోసం కర్నూలులో అవగాహన సదస్సు నిర్వహించినట్లు ఆమె పేర్కొన్నారు. అంతకు ముందు తెలుగుదేశం పార్టీ విభిన్న ప్రతిభావంతుల విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి ఎల్లప్ప మరియు జిల్లా వికలాంగుల సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్కే వెంకటేశ్వర్లు , ఉపాధ్యక్షుడు రంగస్వామి మరియు సభ్యుడు శ్రీరాములు, సాంబ శివ రావు బాలలత ను మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించారు.

