మిస్సింగ్ కేసు నమోదు…
1 min read

మహానంది, న్యూస్ నేడు: మహానంది మండలం అబ్బీపురం గ్రామానికి చెందిన ఒక మహిళ మిస్సింగ్ (కనబడుటలేదు) అనే సంఘటనకు సంబంధించి కేసు నమోదు చేసినట్లు మహానంది ఎస్సై రామ్మోహన్ రెడ్డి మంగళవారం పేర్కొన్నారు. తన కోడలు సుధా రాణి అంగటి సరుకులు తీసుకుని వస్తానని చెప్పి 18వ తేదీ బయటికి వెళ్లిందని ఇంతవరకు తిరిగి రాకపోవడంతో 19వ తేదీ ఆ మహిళ మామ గుల్లెన్న తన కోడలు అయిన సుధారాణి కనిపించడం లేదని ఫిర్యాదు చేసినట్లు ఎస్ఐ రామ్మోహన్ రెడ్డి తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.

