బ్రాహ్మణులు సమిష్టిగా ఎదగాలి
1 min read

కర్నూలు నగర బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు సండేల్ చంద్ర శేఖర్
- భ్రాహ్మణుల కార్తీక వన భోజనం విజయవంతం..
కర్నూలు, న్యూస్ నేడు:రాష్ట్రంలో బ్రాహ్మణులందరూ ఐక్యంగా ఉండి.. సమిష్టిగా ఎదగాలని ఆకాంక్షించారు కర్నూలు నగర బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు సండేల్ చంద్ర శేఖర్. కర్నూలు నగరం సంకల్ భాగ్లోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి భవానీ సమేత రామలింగేశ్వర స్వామి దేవాలయం హరి హర క్షేత్రం కీర్తిశేషులు కెవి రంగారావు ఆర్ష ధర్మ కేంద్రం, లక్ష్మీ వెంకటేష్ కళ్యాణ మండపం నందు కర్నూలు నగర బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం బ్రాహ్మణ కార్తీక వన భోజన మహోత్సవం జరిగింది. కార్యక్రమంలో భాగంగా ఉదయం శ్రీ గణపతి పూజ మహా శివుని అభిషేకం, శ్రీవారి అభిషేకం ఉసిరిక చెట్టు (ఆమ్లవృక్షం) పూజా కార్యక్రమాలు జరిగాయి. ఈ సందర్భంగా ప్రముఖులు మాట్లాడుతూ… బ్రాహ్మణులు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా రాణించాలని పిలుపునిచ్చారు. అనంతరం కార్తీక వన భోజన మహోత్సవానికి వచ్చిన దాదాపు 1000 మంది కుల బాంధవులకు భోజనాలు, వసతులు ఏర్పాటు చేశారు. అనంతరం ముఖ్య అతిథులుగా విచ్చేసిన చిట్టిబట్ల భరద్వాజ శర్మ శ్రీశైలం బోర్డు మెంబర్, మరియు గౌరవ ముఖ్య అతిథులు కల్కూర చంద్రశేఖర్, అంజన్న బాబు ఎమ్మార్వో డోన్, రిటైర్డ్ డి.ఎస్.పి sd తేజేశ్వరరావు, రిటైర్డ్ ఎస్పి హోంగార్డ్స్ చంద్రమౌళి ని ఘనంగా సన్మానించారు. మరియు వివిధ రకాల గేమ్స్ నందు గెలుపొందిన వారికి సన్మానము బహుమతి ప్రధానం చేయడం జరిగింది. అనంతరము దేవాలయ ప్రాంగణంలో కార్తీకమాసం భోజనం ఏర్పాటు చేశారు.
ఆకట్టుకున్న ఆటల పోటీలు..
అనంతరం సాంస్కృత కార్యక్రమాలు మహిళలకు మ్యూజికల్ చర్చ్ లెమన్ గేమ్స్ మరియు లెమన్ అండ్ బకెట్ గేమ్స్ నిర్వహించారు. అనంతరం శ్రీ చిన్మయ స్కూల్ ఆవరణంలో సభ ఏర్పాటు చేయడం జరిగింది. కార్యక్రమంలో కర్నూలు నగర బ్రాహ్మణ సంఘం కార్యదర్శి చల్లా నాగరాజు శర్మ, ఉపాధ్యక్షుడు కంచు గంటల శ్యామసుందర రావు, ఉప కార్యదర్శి నాగులవరం రాజశేఖర్, కోశాధికారి సిఎస్ ప్రసాదరావు, గౌరవ సలహాదారు శ్రీమతి కృష్ణ జ్యోతి, టీవీ రవిచంద్ర శర్మ, సముద్రాల శ్రీధర్ శర్మ, పద్మనాభరావు, భాను ప్రకాష్, శ్రీనివాసరాజు, సివి మురళీకృష్ణ, సుబ్రహ్మణ్యం, రాధాకృష్ణ, బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ డైరెక్టర్లు శ్రీ ధార్వాడ ఆనందరావు, ఎస్కే శ్రీనివాసరావు , గౌరవఅతిథి కళ్ళే వేణుగోపాల్ శర్మ, ఆలయ మేనేజర్ శివన్న, ఆలయ అర్చకులు ప్రసన్న స్వామి, మహేష్ స్వామి, గుర్రాజచార్, వంట మాస్టర్ రఘు, వారి బృందం, తదితరులు పాల్గొన్నారు.


