NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

బిఎస్ఎన్ఎల్  ఆజాది కా ఆఫర్ రూ .1 / కే 

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు: బిఎస్ఎన్ఎల్ నుండి ఆజాది కా ఆఫర్  రూ.1కే , 30 రోజులు పాటు ప్రతిరోజు 2 జిబి డేటా ఉచిత కాల్స్ మరియు ఉచిత సిమ్. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఆత్మనిర్భర భారత్ లో భాగంగా బిఎస్ఎన్ఎల్ పూర్తి స్వదేశీ సాంకేతికతతో 4జి సేవలను దేశవ్యాప్తంగా ప్రారంభించి మంచి లాభములతో ముందుకెళ్తున్నది. స్వతంత్ర దినోత్సవం మాసం అయిన ఆగస్టు నెలలో బిఎస్ఎన్ఎల్  ఆజాద్ కా ఆఫర్ ను ప్రవేశపెట్టినది .ఈ నెలలో ఎవరైనా కొత్త సిమ్ ను బిఎస్ఎన్ఎల్ నుండి పూర్తి ఉచితంగా పొంది  రూ 1/కే  , 30 రోజులపాటు ప్రతిరోజు 2 జిబి డేటా,  ఉచిత కాల్స్ పొందవచ్చును. ఇతర ఆపరేటర్ నుండి బిఎస్ఎన్ఎల్ కు పోర్ట్ అయిన వారికి కూడా ఈ ఆఫర్ వర్తిస్తుంది. కావున  వినియోగదారులు దగ్గర్లో ఉన్న బిఎస్ఎన్ఎల్ సేవా కేంద్రము లేదా రిటైలర్ ను సందర్శించి ఈ ఉచిత ఆఫర్ను పొందగలరు. 4జి ను ప్రారంభించిన తరువాత డేటా స్పీడులో మంచి వృద్ధిని నమోదు చేసుకున్న తరుణంలో ఈ ఆఫర్ వినియోగదారులకు మంచి ఉపయోగకరంగా ఉంటుంది అని కర్నూలు టెలికాం డిస్ట్రిక్ట్ ప్రిన్సిపల్ జనరల్ మేనేజర్ శ్రీ జి రమేష్ తెలియజేశారు.

About Author