NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

సహనం నశించింది…అసంతృప్తితో ఉన్న ఉద్యోగులు

1 min read

ఎమ్మిగనూరు  న్యూస్  నేడు:  ఎమ్మిగనూరు పట్టణంలో ఏపీఎస్ఆర్టీసీ ఎమ్మిగనూరు డిపో నందు ఆలస్యం అవుతున్న డ్రవర్, కండక్టర్ల చార్ట్ కౌన్సిలింగ్ చేయవలసిందిగా పలువురు ఎమ్మిగనూరు డిపో లని ఉద్యోగులు  డిపో మేనేజర్ కి వినతి పత్రం ద్వారా విజ్ఞప్తి. చేశారు.ఎమ్మిగనూరు డిపో నందు చార్ట్ కౌన్సిలింగ్ చేసి సుమారుగా రెండు సంవత్సరములు కావస్తున్నది. ఇతర డిపోలలో కర్నూలు జిల్లాలో మా ఎమ్మిగనూరు చార్ట్ కౌన్సిలింగ్ అయిన తర్వాత రెండుసర్లు చాట్ కౌన్సెలింగ్ అన్ని డిపో లలో జరిగింది. కానీ మా డిపోలో మాత్రం డ్రైవర్ కండక్టర్లు చాట్ కౌన్సిలింగ్ జరగక ఇబ్బందులు ఎదుర్కొనుచున్నాము. ఈ విషయమై తమరికి యూనియన్లు మరియు స్వతహాగా డ్రైవర్ కండక్టర్లు కూడా ఎన్నిసార్లు   చార్ట్  కౌన్దసిలింగ్ చెప్పినా ప్రస్తావించిన ఫలితం లేకపోయింది. కావున యూనియన్లకు సంబంధం లేకుండా డ్రైవర్ కండక్టర్లు వెంటనే చార్ట్ కౌన్సిలింగ్ చేయవలెనని తమరిని విజ్ఞప్తి చేస్తూ. చార్ట్ కౌన్సిలింగ్ ఆలస్యం అయినందువల్ల ఎమ్మిగనూరు డిపోలో డ్రైవర్ కండక్టర్లుగా పనిచేస్తున్న మేము సంతకాల సేకరణ చేసి తమరితోపాటు జిల్లా కలెక్టర్ కి కూడా కర్నూలుకు పంపదలిచాము. ఈ విషయమై త్వరితగా తమరు మా విజ్ఞప్తిని ఆలకించి చాట్ కౌన్సిలింగ్ చేయవలసిందిగా సవినయంగా కోరుకొనుచున్నాము. అంటూ దాదాపు 125 మంది ఎమ్మిగనూరు డిపో లోని సిబ్బంది ఒక వినతి పత్రాన్ని డిపో మేనేజర్ శ్రీ మద్దిలేటి నాయుడు కి అందజేశారు . ఆయన ఈ విషయమై స్పందిస్తూ మీ దగ్గర ఉన్న రెండు యూనియన్లు కలిసి చార్ట్ న తయారు చేసుకుని వచ్చినట్లయితే చార్ట్ వేస్తానని ప్రస్తావించారు. మీరు చార్ట్ వేస్తామని షెడ్యూల్ ను పకటించాలని ఉద్యోగులు కోరగా త్వరలోనే సీనియార్టీ లిస్టు ఇస్తూ షెడ్యూల్ను ప్రకటిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాధవరం వలి, నరసింహులు, నీలకంఠ, సురేష్ బాబు, శ్రీనివాసులు, మాధవ్, తదితరులు పాల్గొన్నారు.

About Author