బిఎస్ఎన్ఎల్ ఉచిత 4 జి సిమ్ మెగా మేళా ..
1 min read

కర్నూలు, న్యూస్ నేడు: బిఎస్ఎన్ఎల్ కర్నూలు బిజినెస్ ఏరియా పరిధిలోని అన్ని బిఎస్ఎన్ఎల్ ఆఫీసుల వద్ద గురువారం నాడు అనగా ఆగస్టు 14వ తేదీ ఉచిత 4 జి సిమ్ మెగా మేళా నిర్వహిస్తామని కర్నూలు బిజినెస్ ఏరియా ప్రిన్సిపల్ జనరల్ మేనేజర్ శ్రీ జి రమేష్ ఒక ప్రకటనలో తెలియజేశారు. కర్నూలు , నంద్యాల జిల్లాలోని అన్ని మొబైల్ టవర్లను 4 జి టవర్లుగా మార్చామని తెలుపుతూ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్న ఈ ఆగస్టు నెలలో బిఎస్ఎన్ఎల్ ఫ్రీడం ప్లాన్ ను దేశవ్యాప్తంగా ప్రవేశపెట్టిందని తెలిపారు. ఈ ఆఫర్ కింద కేవలం రూ.1కే , 30 రోజులు పాటు ప్రతిరోజు 2 జిబి డేటా, అపరిమితమైన కాల్స్ మరియు 100 ఎస్ ఎం ఎస్ లు పొందవచ్చని తెలిపారు. ఇతర ఆపరేటర్ నుండి బిఎస్ఎన్ఎల్ కు పోర్ట్ అయిన వారికి కూడా ఈ ఆఫర్ వర్తిస్తుందని, ఈ ఆఫర్ ఆగస్టు 31వ తేదీ వరకు మాత్రమే ఉంటుందని తెలిపారు. కావున వినియోగదారులు దగ్గర్లో ఉన్న బిఎస్ఎన్ఎల్ ఆఫీసులను, సేవా కేంద్రము లను లేదా రిటైలర్ ను సందర్శించి ఈ ఉచిత ఆఫర్ను పొందగలరని విజ్ఞప్తి చేశారు.
Sd/-జి రమేష్, ప్రిన్సిపల్ జనరల్ మేనేజర్ టెలికాం డిస్ట్రిక్ట్, కర్నూల్.

