NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

అధికారుల నిర్లక్ష్యంతోనే..చెరువుకు గండి

1 min read

చెరువును పరిశీలించిన జాయింట్ కలెక్టర్ మరియు మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి..

మిడుతూరు  , నందికొట్కూరు న్యూస్​ నేడు :  గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు నంద్యాల జిల్లా మిడుతూరు మండల పరిధిలోని జలకనూరు మద్దిగుండం చెరువు కట్ట తెగడంతో చెరువులో ఉన్న నీళ్లన్నీ పంట పొలాల్లోకి భారీగా నీళ్లు వెళ్తున్నాయ్. సోమవారం తూము దగ్గర గండి పడింది అదే రోజు రాత్రి 9:30 కు అధికారులతో కలిసి నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య పరిశీలించారు. మంగళవారం తెల్లారే సరికి కట్ట పోయింది.మంగళవారం ఉదయం నంద్యాల జిల్లా జాయింట్ కలెక్టర్ సి.విష్ణు చరణ్ చెరువును పరిశీలించారు.రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని గండిపడిన చోటా సమస్యను వెంటనే పరిష్కరించాలని జేసీ నీటిపారుదల శాఖ అధికారులను ఆదేశించారు.అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ సమస్య తలెట్టిందని జలకనూరు,తలముడిపి ఖాజీపేట రైతులు ఆరోపిస్తున్నారు.సోమవారం రాత్రి నుండి మిడుతూరు ఎస్ఐ ఓబులేష్ సిబ్బందితో కలిసి చెరువును పర్యవేక్షించారు.మంగళవారం సాయంత్రం మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి చెరువును పరిశీలించి మీడియాతో మాట్లాడారు.ఈ కార్యక్రమంలో ఆర్డీవో నాగజ్యోతి,ఇన్చార్జ్ ఎంపీడీఓ సురేష్ కుమార్,తహసిల్దార్ శ్రీనివాసులు,ఏఓ పీరు నాయక్,ఆర్ఐ జహంగీర్, సత్యం రెడ్డి,దామోదర్ రెడ్డి, స్వామిరెడ్డి పాల్గొన్నారు.

About Author