NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఘనంగా గ్రంథాలయ శాస్త్ర పితామహుడు ఎస్. ఆర్. రంగనాథన్ జయంతి 

1 min read

పత్తికొండ, న్యూస్​ నేడు:  మంగళవారం   పత్తికొండ శాఖ గ్రంథాలయంలో గ్రంథాలయ శాస్త్ర పితామహుడు ఎస్ ఆర్ రంగనాథన్ గారి 133వ జయంతి ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి స్థానిక ఇన్చార్జి గ్రంథాలయాధికారి  విశ్వనాథరెడ్డి మరియు విశ్రాంత గ్రంథాలయాధికారి ఎస్ రామ్ కుమార్ల పూలమాలలు వేసి నివాళులర్పించారు.  విశ్రాంత గ్రంథాలయ అధికారి రామ్ కుమార్  మాట్లాడుతూ, గ్రంథాలయ శాస్త్ర అభివృద్ధికి ఎస్ ఆర్ రంగనాథన్ గారి సేవలు ఎనలేనివని, ఆయన కృషికి ప్రతిఫలంగా పద్మశ్రీ పురస్కారం  దక్కిందని తెలిపారు. ఆయన జయంతి సందర్భంగా  ఆగస్టు 12 న గ్రంథాలయాధికారుల దినోత్సవం గా జరుపుకుంటారని అన్నారు. గ్రంథాలయ అధికారులు అందరికీ ఈ సందర్భంగా ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రంధాలయ అధికారులు, పాఠకులు తదితరులు పాల్గొన్నారు.

About Author