రోడ్లు వేయండి..ప్రమాదాలు నివారించండి
1 min read

యూరియా బ్లాక్ మార్కెట్ పై చర్యలు తీసుకోవాలి..
మిడుతూరు, న్యూస్ నేడు(నందికొట్కూరు): నంద్యాల జిల్లా మిడుతూరు మండలంలో దెబ్బతిన్న రోడ్లను బాగు చేసి ప్రమాదాలను నివారించాలనిసీపీఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీజిల్లా కార్యదర్శి పిక్కిలి వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. వెంకటేశ్వర్లు మాట్లాడుతూ. మిడుతూరు మండలంలో ఉన్న సమస్యలపైన పోరాటాలు నిర్వహించాలని మండలంలోని మిడుతూరు నుండి కడుమూరు మీదుగా కర్నూలు రోడ్డు..దేవనూరు- సున్నంపల్లి రోడ్డు,నాగలూటి క్యాంపు నుండి నేషనల్ హైవే రోడ్డు వరకు రోడ్లు విపరీతంగా గుంతలు గుంతలుగా ఏర్పడ్డాయని వాటి వల్ల ప్రయాణికులు ప్రమాదాల బారిన పడుతున్నారని వెంటనే రోడ్లను వేయాలని అన్నారు.రైతులకు ఎరువులు యూరియా అందడం లేదని తక్షణమే యూరియాను రైతులకు అందించాలని బ్లాక్ మార్కెట్ లో తరలిస్తున్న వారి పై చట్టపరమైన చర్య తీసుకోవాలని అధిక ధరలకు అమ్ముతున్న షాపులను సీజ్ చేయాలని జలకనూరు మద్దిగుండం చెరువు గండికి మరమ్మతులు చేయాలని అన్నారు.ఈ కార్యక్రమంలో దేవనూరు నాగరాజు,చెరుకు చెర్ల గాబ్రియేల్,కాటేపోగు సోమన్న,నరసింహులు పాల్గొన్నారు.

