NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఘనంగా జాతీయ సైన్స్ దినోత్సవం

1 min read

ప్యాపిలి న్యూస్ నేడు: ప్యాపిలి మండల పరిధిలోని బావిపల్లె ఉన్నత పాఠశాలలో జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా శనివారం ఘనంగా కార్యక్రమాలు నిర్వహించారు. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 28న జాతీయ సైన్స్ దినోత్సవం జరుపుకుంటారు. ఈ దినోత్సవాన్ని భారత శాస్త్రవేత్త సి.వి. రామన్  రామన్ ప్రభావం ఆవిష్కరణకు గౌరవార్థంగా నిర్వహిస్తారు. ఈ పాఠశాలకు ముఖ్య అతిథులుగా మండల విద్యాధికారులు మహేశ్వర్ రెడ్డి వెంకటేశ్వర నాయక్ హాజరయ్యారు.ఈ సందర్భంగా పాఠశాలలో సైన్స్ ప్రదర్శనలు, మోడల్ ఎగ్జిబిషన్, వ్యాసరచన, క్విజ్ పోటీలు నిర్వహించి, విద్యార్థులు తాము తయారు చేసిన శాస్త్రీయ నమూనాలను ప్రదర్శించి అందరినీ ఆకట్టుకున్నారు. మండల విద్యాధికారులు,ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులు మాట్లాడుతూ శాస్త్ర విజ్ఞానం మన జీవితంలో ఎంత ముఖ్యమో వివరించి, విద్యార్థులు శాస్త్రంపై ఆసక్తి పెంపొందించుకోవాలని, ప్రతి ఒక్క విద్యార్థులు నైపుణ్యాలు దాగి ఉంటాయని వాటిని వెలికి తీయడమే సైన్స్ అని సూచించారు. మండల విద్యాధికారులు మహేశ్వర్ రెడ్డి మరియు వెంకటేశ్వర నాయక్, ప్రధానోపాధ్యాయులు శివయ్య ఉపాధ్యాయులు మదన గోపాల్, మద్దిలేటి, వెంకటరమణ,మద్దయ్య, ఇబ్రహీం సుమలత, మాబు సుభాన్ శివ ప్రసాద్మరియు విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో సైన్సు ఉపాధ్యాయులకు సన్మానం చేశారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు,విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

About Author