NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

అంగన్వాడీ పోస్టులకు దరఖాస్తుల స్వీకరణ

1 min read

18 పోస్టులకు ఈనెల 18 చివరి తేదీ

-సీడీపీవో బిఏ మంగవళ్లి..

నందికొట్కూరు న్యూస్ నేడు:నంద్యాల జిల్లా నందికొట్కూరు పరిధిలో 18 అంగన్వాడీ ఆయా పోస్టులకు అర్హులైన వారి నుండి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు నందికొట్కూరు శిశు అభివృద్ధి పథక అధికారి (సిడిపివో) బిఏ మంగవల్లి అన్నారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దరఖాస్తులు చేయదలచిన వారు ఈ నెల 18వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు దరఖాస్తులను అటెస్టేషన్ చేసి నందికొట్కూరు సిడిపిఓ కార్యాలయంలో అందజేయాలన్నారు. ఖాళీగా ఉన్న కేంద్రం మరియు రిజర్వేషన్ వివరాలు నందికొట్కూరు మండలం:అంగన్వాడి ఆరవ కేంద్రం-బిసి సి,10వ కేంద్రం బిసి-డి,15వ కేంద్రం- బిసి బి,18వ కేంద్రం-బిసి ఈ,28వ కేంద్రం-ఎస్సీ 3, 31వ కేంద్రం ఓసి.. నాగటూరు-బిసి ఏ, బ్రాహ్మణకొట్కూర్ మూడవ అంగన్వాడి కేంద్రం-ఓసి.. మిడుతూరు మండలం:49 బన్నూరు-ఓసి,చౌటుకూరు మూడవ కేంద్రం-బీసి డి, మిడుతూరు 1వ కేంద్రం-బి సి ఏ..పగిడ్యాల  మండలం:ఆంజనేయ నగర్-ఓసి ఈడబ్ల్యూఎస్.. పాములపాడు మండలం: మిట్టకందాల 3వ కేంద్రం- బిసి సి,ఇస్కాల మూడవ కేంద్రం-ఓసి..కొత్తపల్లి మండలం:సిద్దేశ్వరం-బీసీ బి,వీరాపురం రెండవ కేంద్రం-ఓసి,ఎర్రమఠం రెండవ కేంద్రం-ఓసి(విహెచ్ అంధులు),దుద్యాల-(ఓసి ఈడబ్ల్యూఎస్) అర్హులైన వారు 10వ తరగతి ఉత్తీర్ణత సాధించి స్థానిక గ్రామంలో నివాసులై ఉండాలి 35 సంవత్సరాల లోపు ఉండాలని అర్హులైన మహిళలు దరఖాస్తు చేసుకోవాలని సిడిపిఓ కోరారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *