NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

కలిసికట్టుగా పనిచేయాలన్న చంద్రబాబు.. కౌతాళంలో విడివిడిగా కార్యక్రమాలు

1 min read

కౌతాళం  న్యూస్ నేడు : మండల పరిధిలో కార్య క్రమం నిర్వహించగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూటమి నాయకులు వర్గ రాజకీయాలకు తావివ్వకుండా సమన్వయంతో పనిచేయాలని పలుమార్లు సూచించినప్పటికీ, కౌతాళం మండలంలో నిర్వహించిన ఇంటింటి కార్యక్రమం, పెన్షన్ పంపిణీ కార్యక్రమాలు కూటమిలోని వర్గ విభేదాలను మరోసారి బహిర్గతం చేశాయి.ఒకవైపు ఉరుకుంద శ్రీ ఈరన్న స్వామి దేవస్థానం మాజీ ట్రస్ట్ బోర్డు చైర్మన్ చెన్న బసప్ప, బాపురం నాయకుడు శివమోహన్ రెడ్డి తదితరులు మండలంలోని పలు ప్రాంతాల్లో ఇంటింటి కార్యక్రమం నిర్వహిస్తూ పెన్షన్ పంపిణీలో పాల్గొన్నారు.మరోవైపు టీడీపీ మంత్రాలయం నియోజకవర్గ ఇన్‌చార్జి రాఘవేంద్ర రెడ్డి కౌతాళం మండలం రౌడూరు గ్రామంలో ఇంటింటికీ వెళ్లి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అలాగే అర్హులైన లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ చేసి ప్రభుత్వ సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించారు.అయితే ఒకే కార్యక్రమాన్ని కూటమి నాయకులు వేర్వేరుగా నిర్వహించడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూటమి నాయకులు సమన్వయంతో కలిసి పనిచేయాలని సూచించిన నేపథ్యంలో, కౌతాళం మండలంలో జరిగిన ఈ పరిణామాలు కూటమిలో సమన్వయ లోపం, వర్గపోరుకు సంకేతమా అనే చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది.అయితే ఈ అంశంపై కూటమి నాయకుల నుంచి అధికారికంగా ఎలాంటి స్పందన వెలువడలేదు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *