NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మధ్యాహ్నం భోజనం తనిఖీ..

1 min read

హోళగుంద మండల కేంద్రంలో ఉన్నటువంటి స్థానిక జిల్లా పరిషత్ ఉన్నంత పాఠశాలలో మధ్యాహ్నం భోజనం తనిఖీ చేసిన వైఎస్ఆర్సిపి విద్యార్థి సంఘం మండల అధ్యక్షుడు కొండా అమ్రేష్

హొళగుంద న్యూస్ నేడు : ఈ సందర్భంగా వైఎస్ఆర్సిపి విద్యార్థి సంఘం మండల అధ్యక్షుడు కొండా అమ్రేష్ మాట్లాడుతూ పాఠశాలలో నెలకొన్న సమస్యల గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నాము. అదేవిధంగా పాఠశాలలో ఉపాధ్యాయుల సమస్య కొరత చాలా ఎక్కువగా ఉంది. విద్యార్థులకు బాత్రూంలు టాయిలెట్లు సదుపాయం సరిగ్గా లేవని మధ్యాహ్నం భోజనం చేసే సమయంలో దుమ్ము ధూళితో పాఠశాల మైదానంలో అన్నం తినాల్సిన పరిస్థితి ఏర్పడింది కాబట్టి విద్యార్థులకు భోజనం చేయడానికి హాల్ నిర్మించాలని మేము డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా మధ్యాహ్నం భోజనాన్ని పరిశీలిస్తూ  ఉడకని అన్నం  నీళ్లు మాదిరిగా ఉన్న చట్నీని వడ్డించడం జరిగిందని విద్యార్థులు వాపోయారు. ఈ విధంగా ఉంటే విద్యార్థులు ఎలా తింటారు అంటూ వైఎస్సార్సీపీ విద్యార్థి సంఘం నాయకులు అధికారులను నిలదీస్తామని మేము హెచ్చరించారు. జిల్లా ఉన్నంత అధికారులు స్పందించి ఈ పాఠశాలలో ఇటువంటి  సంఘటన మరొకసారి జరగకుండా విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని మేము అధికారం హెచ్చరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపి విద్యార్థి సంఘం నాయకులు విద్యార్థులు మండల యూత్ అధ్యక్షుడు బి. సిద్ద లింగ తదితరులు పాల్గొన్నారు.

About Author