NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మండలంలో ఘనంగా కాశీభట్ల సాయినాధ శర్మ జన్మదిన వేడుకలు

1 min read

చెన్నూరు ,న్యూస్ నేడు:  పుణ్యభూమి చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు, వైఎస్ఆర్సిపి నాయకులు కాశీభట్ల సాయినాథ శర్మ జన్మదిన వేడుకలను మండలంలో ఆయన అభిమానులు మంగళవారం ఘనంగా నిర్వహించారు. మండలంలో సోమవారం రాత్రి నుండి పలు కూడళ్లల్లో బ్యానర్లు ఏర్పాటు చేసిన ఆయన అభిమానులు మంగళవారం ఉదయమే చెన్నూరులోని బ్రాహ్మణ వీధిలో వెలసిన శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో సాయినాథ్ శర్మ పేరున అర్చన, ప్రత్యేక పూజలు చేయించడం జరిగింది. అలాగే బాణాసంచా పేలుస్తూ కేక్ కటింగ్ గావించి గ్రామంలో పంచిపెట్టారు. ఈ సందర్భంగా కాశీభట్ల సాయినాధ శర్మ అభిమానులు మాట్లాడుతూ, ప్రతిక్షణం పేదల పక్షాన పోరాడుతూ, తనను నమ్ముకున్న వారికి అన్ని విధాల  అందుబాటులో ఉంటూ, ఏ సమస్య వచ్చిన తానున్నానంటూ అందరికీ భరోసా కల్పించి, వారికి అన్ని విధాల అడ్డదండలుగా ఉన్న పేదల పెన్నిధి తమ ఆత్మీయ నాయకునికి పుట్టినరోజు సందర్భంగా ప్రతి ఏడాదిలాగా ఈ ఏడాది కూడా ఆయన జన్మదినాన్ని ఆయన అభిమానులమైన తామంతా ఘనంగా జరుపుకోవడమే కాకుండా అనేక సామాజిక కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందన్నారు. ప్రతి ఒక్కరు తమ తమ గ్రామాలలో అక్కడ ఉన్న ప్రజలకు అందు బాటులో ఉండాలని తమకు తోచిన సహాయ సహకారాలు అందించాలని ఆయన సూచించిన మేరకు ఆయన అభిమాన అభిమానులమైన మేమంతా కూడా తూచా తప్పకుండా పాటించడం జరుగుతుందన్నారు. ఆయన కరోనా కష్టకాలంలో ప్రజలకు అనేక విధాలుగా సహకారాలు అందించడం జరిగిందని ఆక్సిజన్ కొరత ఉన్న ఆ సమయంలో ఆయన తన పుణ్యభూమి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఆక్సిజన్ అందించడమే కాకుండా ఆయా గ్రామాలలో నిత్యవసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది అన్నారు. అంతేకాకుండా అనేక ప్రజా సేవా కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు.  పేదల పాలిట పెన్నిధి, భవిష్యత్ తరాల ఆశాజ్యోతి మా నాయకుడు కాశీభట్ల సాయినాథ్ శర్మ మరిన్ని పుట్టిన వేడుకలు జరుపుకోవాలని ఆయనకు ఆ దేవుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆయన  అనుక్షణం పేద ప్రజల కోసం తమ పుణ్యభూమి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అనేక సేవలు అందించాలని ఆయన అభిమానులు కోరారు. ఈ కార్యక్రమంలో పెద్ద బుద్ధి వెంకట శివప్రసాద్, తుపాకుల జనార్దన్ రెడ్డి, చంగా బ్రహ్మయ్య, బాలకృష్ణారెడ్డి, పురుషోత్తం రెడ్డి,జయరాం, రవి, జనార్ధన్ తోపాటు పెద్ద ఎత్తున ఆయన అభిమానులు పాల్గొనడం జరిగింది.

About Author