పొలం పిలుస్తుంది కార్యక్రమం
1 min read

హొళగుంద న్యూస్ నేడు : సులువాయి రైతు సేవ కేంద్రం పరిధిలోని మండల వ్యవసాయ అధికారి ఆనంద్ లోక దళ్ వారి ఆధ్వర్యంలో పొలం పిలుస్తుంది కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎం చెంగల రాముడు ఏ డి ఏ ఆలూరు వారు హాజరు కావడం జరిగింది ఈ కార్యక్రమంలో చర్చించిన అంశాలు వారు వేసిన పంటలను ఖరీఫ్ 2025 కు సంబంధించి ప్రతి రైతు వారు నమోదు ఈ క్రాప్ బుకింగ్ లో మేమ ఆర్ఎస్కేల పరిధిలో నమోదు చేయించుకోవాలి రైతులు అధిక మోతాడులో యూరియా వాడడం తగ్గించి దానికి బదులుగా నానో యూరియా నానో డిఏపిలను వాడాలి దీనివల్ల రైతులు యొక్క భూములు సారవంతమవుతాయి ఖరీఫ్ 2025 కు రైతులు వారు సాగు చేసిన పంటలకు క్రాఫ్ ఇన్సూరెన్స్ కు మీసేవ కేంద్రాల్లో ప్రీమియం చెల్లించాలి ఎకరాకు పత్తికి 2000, వేరుశనగకు 560 , వరికి 84, కందికి 36, జొన్నకు 38 లు ప్రీమియం చెల్లించి పంటలకు భీమ చేయించుకోవాలి అని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఏ ఈ ఓ విరుపాక్షి, బిహెచ్ఎ ధరణి, VAA రాజు నాయక్, గ్రామ రైతులు తదితరులు పాల్గొన్నారు.


