పిల్లలు సమాజ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించాలి… సిస్టర్ విద్యా
1 min read

తాడేపల్లి న్యూస్ నేడు: గుడ్ షెఫర్డ్ కాన్వెంట్ సిస్టర్స్ స్వచ్ఛంద సంస్థ వారి చైల్డ్ ప్రొటెక్షన్ ప్రాజెక్ట్ లో భాగంగా శుక్రవారం తాడేపల్లి మండలం డోలస్ నగర్ ఏరియాలో సమాజ అభివృద్ధిలో పిల్లల పాత్ర అనే నినాదంతో బాల గంగాధర్ తిలక్ బాలల పార్లమెంట్ సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా సిస్టర్ విద్యా మాట్లాడుతూ సమాజ అభివృద్ధిలో పిల్లలు అత్యంత కీలకమైన భాగస్వాములు, భవిష్యత్తు నిర్మాతలువారు తమ సృజనాత్మకత, కొత్త ఆలోచనలు, ఉత్సాహంతో సామాజిక మార్పుకు దోహద పడతారు అని విద్య, ఆరోగ్యం,సామాజిక బాధ్యత పట్ల పిల్లలకు అవగాహన కల్పించడం ద్వారా, వారు పరిణతి చెందిన పౌరులుగా ఎదిగి,సమాజ అభివృద్ధికి పునాది వేస్తారు అని భవిష్యత్తు నాయకత్వం వారిదే అందుకే పెద్దలు చెప్పారు నేటి పిల్లలే రేపటి నాయకులు అని వారి ఆలోచనలు,నిర్ణయాలు భవిష్యత్తులో దేశం లేదా సమాజం యొక్క దిశను నిర్దేశిస్తాయని పిల్లలలో సామాజిక నైపుణ్యాలు, ఐక్యత,ఆటలు,బడి, మరియు సాంకేతిక పరిజ్ఞానం పెంపొందించే కార్యక్రమాల ద్వారా,పిల్లలు ఒకరి కొకరికి సహకారం,మరియు సమాలోచన కలిగి నేర్చుకుంటారు అని ఇవి బలమైన సమాజ నిర్మాణానికి అవసరమైన మెట్లు అని అన్నారు.తరువాత కమ్యూనిటీ ఆర్గనైజర్ అత్తోట పోతురాజు మాట్లాడుతూఈ రోజుల్లో పిల్లలు సాంకేతికంగా చాలా పరిజ్ఞానం కలిగి ఉండి, పాత పద్ధతులను ప్రశ్నిస్తూ కొత్త పరిష్కార మార్గాలను కనుగొనగలుగుతూన్నారు అని ఇది సామాజిక, సాంకేతిక అభివృద్ధికి సహాయపడుతుంది అని అన్నారు.అలానే ఉత్సవాలు, కుటుంబ విలువలు మరియు సంప్రదాయాల ద్వారా, పిల్లలు సమాజ సాంస్కృతిక వారసత్వాన్ని నేర్చుకుని, దానిని భవిష్యత్తు తరాలకు అందిస్తారు.చైతన్యం మరియు సామాజిక స్పృహ కలిగి పర్యావరణ పరిరక్షణ, పరిశుభ్రత వంటి సామాజిక అంశాలపై పిల్లలు అవగాహన కలిగి ఉండటం వల్ల,వారి కుటుంబాలను మరియు చుట్టుపక్కల వారిని ప్రభావితం చేస్తారు అని సామాజిక బాధ్యత మంచి విద్యను అభ్యసించడం ద్వారా,పిల్లలు నేర్చుకున్న విషయాలను, నైపుణ్యాలను ఉపయోగించి సమస్యలను పరిష్కరించగలరు మరియు సమాజానికి విలువైన సేవలు అందించగలరు అని సంక్షిప్తంగా చెప్పాలంటే పిల్లల శారీరక,మానసిక,మరియు విద్యాపరమైన ఎదుగుదలలో సమాజం పెట్టుబడి పెట్టినప్పుడు, ఆ పిల్లలు సద్గుణవంతులుగా, బాధ్యతాయుతమైన పౌరులుగా మారి సమాజ అభివృద్ధికి తోడ్పడతారు అని భగత్ సింగ్ బాలల పార్లమెంట్ మినిస్టర్స్ చేత ప్రమాణ స్వీకారంచేయించటం జరిగినది.ఈకార్యక్రమంలో సిస్టర్ విద్యా , అత్తోట పోతురాజు, కమ్యూనిటీ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.


