NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

డ్రోన్స్ పై 5 రోజుల స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమం

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు:  రాయలసీమ విశ్వవిద్యాలయం నందు ఉపకులపతి అయిన ఆచార్య  వెంకట బసవరావు  అధ్యక్షతన  రిమోట్లీ ఆపరేటెడ్ వెహికల్స్ – డ్రోన్స్ పై 5 రోజుల స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం లో భాగంగా ట్రిపుల్ ఐటీ డీయం మరియు వారి టీం సభ్యులు విద్యార్థినీ విద్యార్థులకు డ్రోన్ టెక్నాలజీ పై భవిష్యత్తులో వాటి ఉపయోగం పై అవగాహన కల్పించడం జరిగింది.ఉపాకులపతి  మాట్లాడుతూ భవిష్యత్తు లో డ్రోన్ లు వైద్యరంగం, వ్యవసాయ రంగం, యుద్ధ రంగం  నందు విరివిగా ఉపయోగిస్తారని.. కర్నూల్ జిల్లా నందు ఓర్వకల్ ను ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారుమరియు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు  డ్రోన్ సిటీ గా ప్రకటించడం మన అదృష్టం.. కావున విద్యార్థిని విద్యార్థులు  ఇలాంటి అవగాహన సదస్సులు బాగా ఉపయోగించుకోవాలని తెలియజేశారు.ఈ కార్యక్రమం జయప్రదం చేయడంలో ముఖ్య పాత్ర వహించిన ట్రిపు ల్ ఐటీ డిఎం ఆచార్య కృష్ణ నాయక్ ని  మరియు  వారి టీం సభ్యులను ఉపకులపతి   అభినందించడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఇంజనీరింగ్ కాలేజీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ పి. సుందరానంద్, సైన్స్ కాలేజ్ ప్రిన్సిపాల్  ప్రొఫెసర్ విశ్వనాథ రెడ్డి , ప్రోగ్రాం కో -కోఆర్డినేటర్స్ బి.ఏ శరత్ కుమార్, డాక్టర్ రవికుమార్ పాల్గొన్నారు.

About Author