NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఘనంగా బాలల దినోత్సవం.. డా. బారికి చంద్రశేఖర్ చారిటబుల్  ట్రస్ట్

1 min read

ఎమ్మిగనూర్ న్యూస్ నేడు:  ఎమ్మిగనూరు పట్టణంలో ఎస్.ఎం.టి కాలనీ, ప్రభుత్వ ఎంపీపీ స్కూల్ నందు డాక్టర్ బారికి చంద్రశేఖర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సూక్ష్మ కళాకారుడు, జాతీయ అవార్డు గ్రహీత డాక్టర్ బారికి  చంద్రశేఖర్  ఘనంగా బాలల దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మిగనూరు ఆర్.ఐ. పిల్లలకు బహుమతులు అందించి పిల్లలను సంతోషపరిచే విధంగా ప్రశంసించారు. అలాగే ట్రస్టు నిర్వాహకులను ఎంతో అభినందించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ చిన్నారులు స్వతంత్ర సమరయోధుల వేషాధారణ తో పాల్గొని బాలల దినోత్సవానికి మరింత వన్నె తెచ్చారు. మాల మహానాడు రాష్ట్ర కార్యదర్శి మాల నరసన్న , పదోన్నతి పొందిన బదిలీ పై వేరే స్కూలుకు వెళ్లిన  స్కూల్ టీచర్ శారద , ట్రస్ట్ సెక్రటరీ ఈరన్న ట్రెజరీ బి పార్వతి ట్రస్ట్ సభ్యులు లక్ష్మి, నాగలదిన్నె నరసింహులు, ఇతరులు పాల్గొని విజయవంతం చేశారు.

About Author