NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

నవోదయ కోచింగ్ సెంటర్లపై చర్యలు ఎక్కడ?

1 min read

ఐక్య విద్యార్థి సంఘాలు

ఎమ్మిగనూరు న్యూస్ నేడు : ఎమ్మిగనూరు పట్టణంలో విచారణ జరిగే నెలలు గడుస్తున్న నవోదయ కోచింగ్ సెంటర్లపై ఎలాంటి చర్య తీసుకోవడం లేదని ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా విద్యార్థి సంఘ నాయకులు ఉదయ్ శేఖర్ కాజా కృష్ణ అఫ్రిది రఘునాథ్ మాట్లాడుతూ ఎమ్మిగనూరు పట్టణంలో ఉన్నటువంటి నవోదయ కోచింగ్ సెంటర్లపై డీఈవో శామ్యూల్ పాల్  విచారణ జరిపి నెలలు గడుస్తున్న వాటి పైన ఎలాంటి చర్య లేదని వారు మండిపడ్డారు అదేవిధంగా ప్రభుత్వాన్ని మోసం చేస్తూ సీట్లు తెప్పిస్తామని విద్యార్థుల తల్లిదండ్రుల నుండి వేలకు వేలు వసూలు చేస్తున్నటువంటి ఈ కోచింగ్ సెంటర్లు ఎందుకు సిజ్ చేయడం లేదని అదేవిధంగా విద్యార్థుల కు ఎలాంటి మౌలిక వసతులు కల్పించట్లేదు విద్యార్థులు తల్లిదండ్రుల నుండి వేలకు వేలు వసూలు చేస్తూ విద్యార్థులు తల్లిదండ్రులు మోసం చేయడం జరుగుతుందని మేము విద్యార్థి సంఘాలుగా ఎన్నిసార్లు ఫిర్యాదు చేసిన కూడా ఎందుకు పట్టించుకోవడంలేదని వారి ఆవేదన వ్యక్తం చేశారు ఇకనైనా జిల్లా అధికారులు దీనిని దృష్టిలో పెట్టుకొని ఆ కోచింగ్ సెంటర్లను సీజ్ చేసి విద్యార్థుల జీవితాలను కాపాడాలని కోరుతూనాము లేనిపక్షంలో మరిన్ని ఉద్యమాలకు దారి తీస్తామని వారు హెచ్చరించారు.

About Author