17 న సీపీఎం నిరాహార దీక్షలు ప్రారంభం..
1 min read

మొక్కజొన్నల కొనుగోలు కేంద్రాల ఏర్పాటు కోసం దీక్షలు..
నందికొట్కూరు, న్యూస్ నేడు: ప్రభుత్వం మొక్కజొన్నల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని కోరుతూ సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలోని పొట్టి శ్రీరాములుసెంటర్ దగ్గర ఈనెల 17వ తేదీన నిరాహార దీక్షలు ప్రారంభిస్తున్నట్లు సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యులు ఎం నాగేశ్వరరావు శుక్రవారం అన్నారు.ఈ సందర్భంగా నాగేశ్వరరావు మాట్లాడుతూ వ్యవసాయ రంగంపై గ్రామీణ ప్రాంతాల్లో 60 శాతం మంది ఆధారపడి జీవిస్తున్నారని పాలక ప్రభుత్వాలు,రాజకీయ పార్టీలు ఊపదంపుడు ఉపన్యాసం చేయడం తప్పా అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు రైతాంగ సమస్యలను విస్మరిస్తున్నారని అన్నారు. పండించిన పంటలను ప్రభుత్వం మద్దతు ధరకు కొనుగోలు చేయకపోవడంతో మధ్య దళారులకు తక్కువ ధరకు అమ్ముకుంటున్నారని చేసిన అప్పులు తీర్చలేక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.గ్రామాల్లో మొక్కజొన్న కేంద్రాలు ఏర్పాటు చేయాలని, దెబ్బతిన్న పంటలకు ఎకరాకు 50 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.ఈనెల 17న చేపట్టే రిలే నిరాహార దీక్షలను రైతులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో పక్కిర్ సాహెబ్, గోపాలకృష్ణ,రైతు సంఘం శ్రీనివాసులు,త్యాగరాజు పాల్గొన్నారు.

