NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

నిరుద్యోగ యువత, విద్యార్థుల హక్కుల కోసం వైఎస్సార్‌సీపీ పోరుబాట

1 min read

డీఎస్సీ అక్రమాలు–స్పోర్ట్స్ కోటా అవినీతిపై ఆందోళన..

ఆగస్టు6, 7, 8 తేదీల్లో రాయచోటి లో రిలే నిరాహార దీక్షలు

10న రాయచోటిలో భారీ శాంతియుత నిరసన ర్యాలీ

జిల్లా వైసీపీ కార్యాలయంలో విద్యార్థి, యువజన సంఘాల రౌండ్ టేబుల్ సమావేశం

అన్నమయ్య జిల్లా ఆగస్టు 3(న్యూస్ నేడు ప్రతినిధి ) : యువత, విద్యార్థుల భవిష్యత్తుతో కూటమి ప్రభుత్వం చెలగాటమాడుతోందని ఆరోపిస్తూ, వారి హక్కుల పరిరక్షణ కోసం ఉద్యమాన్ని ఉధృతం చేయాలని వైఎస్సార్‌సీపీ విద్యార్థి, యువజన సంఘాల నాయకులు నిర్ణయించారు. డీఎస్సీ నియామకాల్లో చోటుచేసుకున్న అక్రమాలు, స్పోర్ట్స్ కోటాలో జరిగిన అవినీతి, నిరుద్యోగ యువతకు జరిగిన అన్యాయం, విద్యాదీవెన–వసతి దీవెన పథకాల కింద విద్యార్థులకు చెల్లించాల్సిన సుమారు రూ.9,500 కోట్ల బకాయిలు, ఫీజులు చెల్లించలేక విద్యార్థులు, వారి తల్లిదండ్రులు బంగారం తాకట్టు పెట్టుకునే దుస్థితి, డిగ్రీలు పూర్తి చేసిన యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో ప్రభుత్వ వైఫల్యం, ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన నిరుద్యోగ భృతిని అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడిచినా అమలు చేయకపోవడం వంటి ప్రజా సమస్యలపై విస్తృత ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించారు. ఈ మేరకు వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి ఆదేశాల మేరకు సోమవారం రాయచోటిలోని జిల్లా వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో విద్యార్థి, యువజన సంఘాల నాయకులతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. రాయచోటిలో ఉన్న జిల్లా కేంద్రాన్ని తరలించి ఈ ప్రాంత ప్రజల హక్కులను ,మనోభావాలును దెబ్బతీసి,  అభివృద్ధికి తీవ్ర ఆటంకం కలిగించారన్నారు ప్రజా వ్యతిరేక నిర్ణయాలను ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని, లేకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.యువత, విద్యార్థుల హక్కుల సాధన కోసం నిర్వహించే రిలే నిరాహార దీక్షలు, శాంతియుత నిరసన ర్యాలీలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు, నిరుద్యోగ యువత పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని సమావేశంలో పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్  చైర్మన్ ఫయాజ్ బాష,మాజీ వైస్ చైర్మన్ ఫయాజుర్ రెహమాన్, వైఎస్ఆర్ సీపి మైనారిటీ జిల్లా అధ్యక్షుడు బేపారి మహమ్మద్ ఖాన్, పట్టణ కన్వీనర్ నవాజ్,బిసి సెల్ రాష్ట్ర అధికార ప్రతినిధి విజయ భాస్కర్,ఎస్ సి సెల్ జిల్లా అధ్యక్షుడు చుక్కా అంజనప్ప, విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు జంగంరెడ్డి కిషోర్ దాస్, రాయచోటి నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షుడు మడితం రెడ్డికుమార్, ఎస్ టి సెల్ రాష్ట్ర కార్యదర్శి బుల్లి వెంకట రమణ,ఎస్ సి సెల్ నియోజక వర్గ అధ్యక్షుడు సగినాల శివశంకర్,  నాయకులు కొలిమి ఛాన్ బాష, ఫయాజ్ అహమ్మద్, గౌస్ ఖాన్, సుగవాసి ఈశ్వర్ ప్రసాద్, వాల్మీకి సంఘ జిల్లా అధ్యక్షుడు గువ్వల బుజ్జిబాబు, టెలికాం సలహా కమిటీ సభ్యుడు అబుజర్, మస్తాన్, హుసేన్, ఖాదర్ బాష, మాజీ కో ఆప్షన్ హజరత్ ఖాదర్ వలీ,   పట్టణ ఉపాధ్యక్షుడు నాగేంద్ర,ఖలీల్, అశోక్, యూసుఫ్ ఖాన్, హాబీబ్, సుబ్బారెడ్డి, మోక్షిత్,నల్లా బత్తిన వెంకట రెడ్డి, దేవేంద్ర రెడ్డి, రామ్మోహన్, లక్ష్మిరెడ్డి, రమణా రెడ్డి, సోమిరెడ్డి, ఫాజిల్,గొర్లముదివేడు శివ,భరత్ రెడ్డి,రమేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *