NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

జిల్లా పరిషత్ మెయిన్ గేటు వద్ద చలివేంద్రం ప్రారంభం

1 min read

ప్రారంభించిన ఉమ్మడి జిల్లా పరిషత్ చైర్మన్ ఘంటా పద్మశ్రీ ప్రసాద్ 

ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: వేసవి కాలంలో అధిక ఉష్ణోగ్రతల కారణంగా బాటసారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని, వారికి తాగునీరు మరియు చల్లదనం అందించేందుకు జిల్లా పరిషత్ కార్యాలయం మెయిన్ గేటు వద్ద ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ ఘంటా పద్మశ్రీ ప్రసాద్  ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్‌పర్సన్  మాట్లాడుతూ, ఎండ తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలకు ఉపశమనం కలిగించడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని అత్యవసరమైతే తప్ప ఎండలో ఎక్కువగా తిరగవద్దని సూచిస్తూ తెలిపారు. జిల్లా కలెక్టర్, కూటమి ప్రభుత్వ ఆదేశాలతో  బాటసారులకు తాగునీరు, శీతల పానీయాలు అందించేందుకు ఏర్పాటు చేసిన ఈ చలివేంద్రం ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. స్వచ్ఛంద సంస్థలు ఈ వేసవిలో చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఉప ముఖ్య కార్యనిర్వాహణాధికారి కె.భీమేశ్వర్ , జిల్లా పరిషత్ పరిపాలనాధికారులు, కార్యాలయ సిబ్బంది,  డివిజన్ కార్పొరేటర్ కె. కలవకొల్లు సాంబ, బి.సి నాయకులు లక్కోజు గోపి,  టీడీపీ యూత్ లీడర్  ఇండ్ల.అశోక్ రాజ్ జిల్లా పరిషత్ కార్యాలయ సిబ్బంది  తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ద్వారా వేసవి తాపాన్ని తగ్గించడంలో భాగంగా ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతో జిల్లా పరిషత్ ముందడుగు వేసినట్లు అధికారులు తెలిపారు.

About Author