NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

నగర ప్రజలు అకాల వర్షాలకు అప్రమత్తంగా ఉండాలి

1 min read

ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి

 పలు ప్రాంతాలను పర్యటించిన ఎమ్మెల్యే

ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్ నేడు  : సోమవారం ఉదయం నుండి కురుస్తున్న భారీ వర్షం కారణంగా స్థానిక పాత బస్టాండ్ మినీ బైపాస్ రోడ్ లో ఉన్న దెయ్యాల కాలువను మున్సిపల్ కమిషనర్,ఎం.ఇ,ఇంజనీరింగ్ సెక్షన్  అధికారులతో కలసి పరిశీలించి కాలువలో అడ్డుపడిన వ్యర్ధాలను తొలగించాలని, కాలవలో వ్యర్ధాలను తొలగించేందుకు జెసిబి తిరిగే విధంగా రోడ్డు మార్గం వేయించాలని, డ్రైనేజీలలో నీటి నిల్వలు చెత్తాచెదారాలు ఉండకూడదని ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య (చంటి)  సిబ్బందికి సూచించారు. అకాల వర్షాల కారణంగా ఏలూరు నగర ప్రజలు,వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని తగు జాగ్రత్తలు పాటించాలని అన్నారు. పలు ప్రాంతాలను ఎమ్మెల్యే పరిశీలించారు.ఎమ్మెల్యే వెంట నగరపాలక సంస్థ కో-ఆప్షన్ సభ్యులు ఎస్ ఎం ఆర్ పెదబాబు, కార్పొరేటర్లు, మున్సిపల్ సిబ్బంది ఉన్నారు.

About Author