NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

సీఎం ఆర్ ఎఫ్.. పేద‌ల‌కు అండ‌..

1 min read

రాష్ట్ర మంత్రి టీజీ భ‌రత్

13 మందికి సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన మంత్రి

కర్నూలు, న్యూస్​ నేడు:  ముఖ్యమంత్రి స‌హాయ నిధి ద్వారా పేద‌ల‌ను ఆదుకుంటున్నామ‌ని రాష్ట్ర ప‌రిశ్రమ‌లు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భ‌ర‌త్ అన్నారు. క‌ర్నూలు న‌గ‌రంలోని ఆయ‌న కార్యాల‌యంలో 13 మందికి ముఖ్య‌మంత్రి స‌హాయ‌నిధి ద్వారా మంజూరైన చెక్కుల‌ను ఆయ‌న అంద‌జేశారు. షేక్ అబ్దుల్ ఆర్మాన్ కు రూ. 19,944, మ‌రియ‌మ్మకు రూ.65వేలు, షేక్ షేకూన్ కు రూ.61,572, ల‌క్ష్మీ నారాయ‌ణ‌కు రూ.1,25,343, మీసాల మాధ‌వ‌స్వామికి రూ.85వేలు, రెహాన సుల్తాన్ కు రూ.25,574, న‌జీర్ అహ్మద్ కు రూ.55వేలు, నీలం మాధ‌వ‌రాయుడు కు రూ. 1,19,708, రాజ‌కుమార్ రెడ్డికి రూ. 1,14,574, షేక్ ఖాజాబీకు రూ. 1,04,196, సుబ్బరామ‌య్యకు రూ.71,922, గౌండ అబ్దుల్ వ‌హీద్‌కు రూ.43,565, ఉప్పు రామ ప‌ద్మజ‌కు రూ.3,35,520ల చెక్కులు మంత్రి టి.జి భ‌ర‌త్ అంద‌జేశారు. మొత్తం రూ. 12,26,918ల విలువ చేసే చెక్కులు అంద‌జేశారు. ఆప‌ద స‌మ‌యంలో కర్నూలు నియోజ‌క‌వ‌ర్గ ప్రజ‌ల‌ను ఆదుకున్న ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడుకు మంత్రి టీజీ భ‌ర‌త్ కృత‌జ్నత‌లు తెలిపారు. చెక్కులు అందుకున్న వారు సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి టీజీ భ‌ర‌త్ ల‌ మేలు మ‌రిచిపోలేమ‌ని సంతోషం వ్యక్తం చేశారు.

About Author