NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

శ్రీ మఠంలో ఎన్టీఆర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సర్

1 min read

మంత్రాలయం, న్యూస్ నేడు: మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామిని దర్శించుకునేందుకుడాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ హెల్త్ సైన్సెస్ వైస్ ఛాన్సర్ చంద్రశేఖర్ వచ్చారు. ఆయనకు శ్రీ మఠం అధికారులు ఆలయ సాంప్రదాయాల ప్రకారం స్వాగతం పలికారు. ఆయన ముందుగా గ్రామదేవత మాంచాలమ్మ దేవిని దర్శించుకుని అనంతరం గురువు రాఘవేంద్ర స్వామి మూల బృందావనాన్ని దర్శించుకున్నారు. పీఠాధిపతి సుబుదేంద్ర తీర్థ స్వామీజీ శాలువాలతో సత్కరించి ఫలమంత్రాక్షతలు ఇచ్చి ఆశీర్వదించారు.అనంతరం కౌతాళం మండలం ఉరుకుంద పుణ్య క్షేత్రం లో వెలసిన శ్రీ లక్ష్మీ నరసింహ ( ఉరుకుంద ఈరన్న) స్వామి ని దర్శించుకున్నారు. వీరితోపాటు ప్రముఖ న్యూరోలోజిస్ట్ హేమంత్ కుమార్, ఎస్ ఐ శివాంజల్ ఉన్నారు.

About Author