NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

సీఎంఆర్ఎఫ్… పేదలకు భరోసా

1 min read

ఐదుగురి కి చెక్కులు పంపిణీ చేసిన మంత్రి టీజీ భరత్

కర్నూలు, న్యూస్​ నేడు:  పార్టీలకు అతీతంగా సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ప్రజ‌ల‌ను ఆదుకుంటున్నామ‌ని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భ‌ర‌త్ చెప్పారు. క‌ర్నూలు న‌గ‌రంలోని ఆయ‌న కార్యాల‌యంలో క‌ర్నూలు నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన 5 మందికి ముఖ్యమంత్రి స‌హాయ‌నిధి ద్వారా మంజూరైన‌ చెక్కులు ఆయన పంపిణీ చేశారు. రాయచూరు పరశురాముడు అనే వ్యక్తికి రూ.20,933, షేక్ సాజిదా అనే మహిళకు రూ.50,800, శ్యామల దేవి అనే మహిళకు రూ.40,437, షబానా కాతూన్ అనే మహిళకు 25,655, శ్రియాన్స్ కు రూ.1,16, 255ల చెక్కులు అందించారు. మొత్తం రూ. 2,54,080 విలువ చేసే చెక్కులు బాదితులకు ఇచ్చారు. ప్రజలకు ఎలాంటి ఆపద వచ్చినా తమ ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *