కర్నూలు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి కి పేషెంట్ ట్రాలీలు విరాళం…
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: కర్నూలు లోని ఆర్కా హాస్పిటల్ వారు 3 ట్రాలీలను, ఓమ్ని హాస్పిటల్ వారు 3 ట్రాలీలను ప్రభుత్వ సర్వజన వైద్యశాల కు విరాళం ఇవ్వడం జరిగింది.ఆక్సిజన్ ను ఉంచడానికి ఉపయోగ పడే విధంగా ఈ పేషెంట్ ట్రాలీలు ఉండడం విశేషం. వీటిని క్రిటికల్ కేర్ యూనిట్ లో ఉపయోగిస్తామని అడిషనల్ డి.ఎం.ఈ . ఆసుపత్రి సూపరిండెంట్ డా. కె . వెంటకేశ్వర్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సూపరిండెంట్ డా. కె వెంకటేశ్వర్లు ,డా.. వెంకట రమణ, హాస్పిటల్ నోడల్ ఆఫీసర్స్ శివ బాల ,డా. క్లింటన్ , ఆర్కా హాస్పిటల్ సీ.ఈ.ఓ. శ్రీనివాస్ తాంబే తదితరులు పాల్గొన్నారు.

