ముఖ్యమంత్రి పర్యటన పై సంబంధిత శాఖలు అధికారులతో కలెక్టర్ సమీక్ష
1 min read
జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి
ఏలూరుజిల్లా ప్రతినిధి, న్యూస్ నేడు: జిల్లాలోని అన్ని ప్రభుత్వ శాఖలలో గత రెండు సంవత్సరాలుగా చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, సాధించిన విజయాలపై సమగ్ర నివేదికలు సమర్పించాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టరు కె. వెట్రిసెల్వి ఆదేశించారు. జిల్లా కలెక్టరేటు గౌతమీ సమావేశ మందిరంలో గురువారం ఈ నెల 10వ తేదీ కైకలూరు నియోజకవర్గం కలిదిండి మండలంలో ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా సంబంధిత శాఖలు అధికారులతో జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి వివిధ అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈనెల కలిదిండి మండలంలో పర్యటన సందర్భంగా జిల్లాలోని అన్ని ప్రభుత్వ శాఖలు గత రెండు సంవత్సరాలుగా చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు, సాధించిన విజయాలను వివిధ శాఖలు అధికారులు నివేదికరూపంలో సిద్ధం చెయ్యాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా జిల్లాలో పట్టాదార్ పాస్ పుస్తకాల జారీకి సంబంధించి ఇప్పటివరకు చేపట్టిన రీ సర్వే, జారీ చేసిన పట్టాదార్ పాస్ పుస్తకాల వివరాలపై సమగ్ర సమాచారం వెంటనే అందించాలన్నారు. ప్రతి శాఖ తమ ప్రొఫైల్, ముఖ్యకార్యకలాపాలు, ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలు అమలుతీరు, సాధించిన పురోగతి, విజయాలను సమగ్రంగా పొందుపరిచే విధంగా నివేదికలు సిద్ధంచెయ్యాలని అన్నారు. అలాగే పబ్లిక్ ప్రవేటు పార్టనర్ షిప్ కింద చేపట్టిన బంగారు కుటుంబాలు దత్తత కార్యక్రమాలు, పిజిఆర్ఎస్, రెవెన్యూ క్లినిక్లు, 22 (ఏ) కేసులు పరిష్కారం, ఫిర్యాదులు పరిష్కార స్థితిని సమాచారం అందించాలని అన్నారు. కీపెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ (KPI) ఆధారంగా శాఖలు పనితీరు, లక్ష్యాలు సాధన, ప్రత్యేక కార్యక్రమాలు వివరాలను స్పష్టంగా నమోదు చెయ్యాలని ఆదేశించారు. ఖచ్చితమైన సమాచారం తాజా గణాంకాలతో, శాఖలు వారీగా క్రమబద్ధంగా, స్పష్టంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. అవసరమైన నివేదికలు నిర్ణీత గడువులోగా సమర్పించాలని, రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు, జిల్లాలో సాధించిన పురోగతిని ప్రతిబింబించేలా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి నివేదికలు అందించాలని తెలిపారు. జూన్ 2024 నుండి నుండి శాఖలు వారీగా ప్రతిశాఖ సమగ్ర సమాచారం, విజయగాధలతో పాటు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కు సీడీలను రూపొందించాలని జిల్లా కలెక్టరు అధికారులను ఆదేశించారు.ఈ సమావేశంలో జిల్లా జాయింటు కలెక్టరు యం.జె.అభిషేక్ గౌడ, అసిస్టెంటు కలెక్టరు సి.హెచ్. శ్రావణ్ కుమార్ రెడ్డి ,జిల్లా రెవిన్యూ అధికారి యం.శ్రీదేవి, విజిలెన్స్ స్పెషల్ డిప్యూటీ కలెక్టరు ఎల్.దేవకీ దేవి, వివిధ శాఖలు అధికారులు పాల్గొన్నారు.



