ఏ.పీ.రాష్ట్ర టూరిజం శాఖా మంత్రి ని కలసిన శ్రీ మద్ది ఆలయ చైర్మన్
1 min read
స్వామి వారి జ్ఞాపికను అందజేసి,శ్రీ మద్ది ఆంజనేయ స్వామి వారి దర్శనానికి ఆహ్వానం
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక శాఖామాత్యులు కందుల దుర్గేష్ గారు జంగారెడ్డిగూడెం పట్టణంలో ఒక ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనడం జరిగినది.ఈ సందర్భంగా శ్రీ మద్ది ఆంజనేయ స్వామి ఆలయ ధర్మకర్తల మండలి ఛైర్మన్ డాక్టర్: రాజాన సత్యనారాయణ (పండు) కలవడం జరిగినది.డాక్టర్: రాజాన మాట్లాడుతూ, తొలుత స్వామి వారి జ్ఞాపికను అందజేసి,శ్రీ మద్ది ఆంజనేయ స్వామి వారి దర్శనానికి రావాలని ఆహ్వానించారు.తదుపరి మద్ది ఆలయానికి సంబంధించిన పలు అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి సహకరించాలని అడిగారు.మంత్రి దుర్గేష్ సానుకూలంగా స్పందించారు.అడిగినవెంటనే స్వామి వారి దర్శనానికి వస్తానని అభివృద్ధి కార్యక్రమాలకు సహకరిస్తానని అన్నందుకు మంత్రి కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసినట్లు రాజాన అన్నారు.

