పుట్టిన బిడ్డకు ముర్రుపాలు ముఖ్యం
1 min read
అల్లూరు,మిడుతూరు’లో సూపర్వైజర్లు అవగాహన..
నందికొట్కూరు న్యూస్ నేడు: పుట్టిన వెంటనే బిడ్డకు గంటలోపుముర్రుపాలు ఇవ్వటం చాలా ముఖ్యమని అంగన్వాడీ సూపర్వైజర్లు జి వెంకటేశ్వరమ్మ,రేణుకా దేవి అన్నారు.నంద్యాల జిల్లా నందికొట్కూరు మండల పరిధిలోని అల్లూరు గ్రామంలో ఒకటవ అంగన్వాడీ కేంద్రంలో గర్భవతులకు బాలింతలకు సూపర్వైజర్ వెంకటేశ్వరమ్మ అవగాహన కల్పించారు. అదేవిధంగా మిడుతూరులో అంగన్వాడీ కేంద్రంలోసూపర్వైజర్ రేణుక దేవి మంగళవారం అవగాహన కల్పించారు. ‘ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు ఈనెల 1 నుండి 7 వరకు నిర్వహిస్తున్నామని వారు అన్నారు.ఈ సందర్భంగా సూపర్వైజర్లు వెంకటేశ్వరమ్మ,రేణుకా దేవి మాట్లాడుతూ పుట్టిన వెంటనే బిడ్డకు ముర్రు పాలు ఇవ్వడం వల్ల వారిలో రోగ నిరోధక శక్తి అధికంగా ఉంటుందని పుట్టినప్పటి నుండి ఆరు నెలల వరకు తల్లిపాలు తప్పనిసరిగా ఇవ్వాలన్నారు.తల్లిపాలలో వ్యాధి నిరోధక శక్తి ఉంటుంది ఆరు నెలలు దాటిన తర్వాత తల్లిపాలతో పాటు పోషకాహారం కూడా ఇవ్వాలని అన్నారు.బిడ్డ పుట్టిన తర్వాత ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలనే వాటి గురించి మరియు గర్భవతి సమయంలో బిడ్డ సురక్షితంగా ఉండాలంటే తీసుకోవలసిన జాగ్రత్తలు పోషకాహారం తదితర వాటి గురించి గర్భవతులకు అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.



