సేవా కార్యక్రమాల్లో యువత…దేశ అభివృద్ధికి శుభ సూచకం
1 min read
లెఫ్ట్ నెంట్ కల్నల్ ప్రసాద్
కర్నూలు ఎడ్యుకేషన్, న్యూస్ నేడు : స్థానిక వెంకాయపల్లిలోని జి. పుల్లయ్య ఇంజనీరింగ్ కళాశాలలో నేడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ యువజన సర్వీసుల శాఖ, సెట్‌కూర్, కర్నూలు మరియు జి.పి.సి.ఇ.టి. ఎన్.సి.సి. యూనిట్ సంయుక్త ఆధ్వర్యంలో ఏ.పి. ఇండియన్ రెడ్‌క్రాస్ వాలంటీర్ల నమోదు కార్యక్రమం మంగళవారం కళాశాల ఆడిటోరియంలో ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో 300 మందికి పైగా ఎన్.సి.సి. క్యాడెట్లు, ఇంజనీరింగ్ విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని రెడ్‌క్రాస్ వాలంటీర్లుగా నమోదు చేసుకున్నారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా 28(ఏ) బెటాలియన్ ఎన్.సి.సి. ఏ.ఓ. లెఫ్టినెంట్ కల్నల్ ఆర్. ప్రసాద్, సెట్‌కూర్ సి.ఈ.ఓ. మరియు జిల్లా యువజన సంక్షేమ అధికారి డా. కె. వేణుగోపాల్ హాజరయ్యారు. గౌరవ అతిథిగా కళాశాల ప్రిన్సిపాల్ డా. సి. శ్రీనివాసరావు విచ్చేశారు. ఈ సందర్భంగా లెఫ్టినెంట్ కల్నల్ ఆర్. ప్రసాద్ మాట్లాడుతూ, “ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ విపత్తుల సమయంలో, యుద్ధ సమయాల్లో అందిస్తున్న సేవలు అనిర్వచనీయం. యువత ఇటువంటి సేవా కార్యక్రమాల్లో భాగస్వామ్యం కావడం దేశ భవిష్యత్తుకు శుభసూచకం” అని అన్నారు. డా. కె. వేణుగోపాల్ మాట్లాడుతూ, రక్తదానం ఆవశ్యకతను వివరిస్తూ “రక్తదానం మానవత్వానికి ప్రతీక. ఒక్క యూనిట్ రక్తం ముగ్గురి ప్రాణాలను కాపాడుతుంది” అని పేర్కొని, ప్రతి విద్యార్థి సంవత్సరానికి కనీసం ఒక్కసారైనా రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు.కార్యక్రమంలో భాగంగా జిల్లా రెడ్‌క్రాస్ శిక్షకులు ఎన్.సి.సి. క్యాడెట్లకు సి.పి.ఆర్., గుండెపోటు, శ్వాస ఆడకపోవడం వంటి అత్యవసర పరిస్థితుల్లో అందించాల్సిన ప్రాథమిక ప్రాణరక్షణ మెలకువలపై ప్రత్యక్ష డెమోతో శిక్షణ ఇచ్చారు. వాలంటీర్లుగా నమోదైన విద్యార్థులకు కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డా. సి. శ్రీనివాసరావు, లెఫ్టినెంట్ డాక్టర్ ఎం మధు శేఖర్ పాల్గొన్నారు.


