NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

వాల్మీకి, బోయల  రౌండ్ టేబుల్ సమావేశానికి తరలిరండి…

1 min read

మాజీ జెడ్పిటిసి రామ్ భీం నాయుడు

హొళగుంద న్యూస్ నేడు : వాల్మికి, బోయల  ఎస్టీ సాధన కోసం రౌండ్ టేబుల్ సమావేశం ఈనెల 17వ తేదీన ఆదోనిలో నిర్వహిస్తామని మాజీ జడ్పిటిసి రాంబినాయుడు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  ఆదోనిలో  భారీ ఎత్తున బహిరంగ సభ నిర్వహించబడుతుంది అని తెలిపారు.అందులో భాగంగానే ఆ బహిరంగ సభను విజయవంతం చేయడానికి జిల్లా నలుమూలల నుండి వాల్మీకి, బోయల  ముఖ్య నాయకులు ఆదోనిలో జేపీ గార్డెన్లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించబడుతుంది.వాల్మీకి, బోయ  ముఖ్య నాయకులు హాజరు కావలసిందిగా కోరారు.ఈ కార్యక్రమంలో వాల్మీకి, బోయల నాయకులు వీరేష్, రాముడు, ఈరప్ప,కుమార్, కోగిలతోట సర్పంచ్ తనయుడు నాగప్ప, నర్సయ్య, వన్నూరప్ప, హోళగుంద వాల్మీకి నాయకులు రంగప్ప, నాగప్ప,లింగంపల్లి కిష్టప్ప, పెద్దహేట్ట కుమార్,ఆదోని హనుమన్న, ముద్దటమాగి సిద్ధప్ప  తదితర వాల్మీకి బోయల సంఘం నాయకులు, పాల్గొన్నారు.

About Author