NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఎస్సీ, ఎస్టీ బాధిత కుటుంబాలకు పరిహారం త్వరితగతిన మంజూరు చేయాలి

1 min read

ప్రతి నెల ఖచ్చితంగా సివిల్ రైట్ డే నిర్వహించాలి

జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి

కర్నూలు, న్యూస్​ నేడు:  ఎస్సీ, ఎస్టీ బాధిత కుటుంబాలకు పరిహారం త్వరితగతిన మంజూరు చేయాలని, ప్రతి నెల ఖచ్చితంగా సివిల్ రైట్ డే నిర్వహించే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి అధికారులను ఆదేశించారు.శుక్రవారం కలెక్టరేట్  కాన్ఫరెన్స్ హాల్లో ఎస్సీ,ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం అమలు కు సంబంధించిన జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశాన్ని  కలెక్టర్ నిర్వహించారు.ఈ సందర్భంగా  కలెక్టర్ 2013 నుండి 2025 వరకు పెండింగ్ లో ఉన్న ఎస్సీ, ఎస్టీ అండర్ ఇన్వెస్టేషన్ కేసులను పోలీసు అధికారులతో సమీక్షించారు..చాలా రోజుల నుంచి పెండింగ్ లో ఉన్న కేసులను కూడా త్వరితగతిన ఇన్వెస్టిగేషన్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.. ప్రతి నెల ఖచ్చితంగా సివిల్ రైట్ డే నిర్వహించే విధంగా చర్యలు తీసుకోవాలని, విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులకు కూడా ముందస్తు సమాచారం ఇవ్వాలని కలెక్టర్  ఆదోని సబ్ కలెక్టర్, కర్నూలు, పత్తికొండ ఆర్డీఓ లను ఆదేశించారు.ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ కింద నిధులు ఎంత ఖర్చు పెట్టారో వివరాలను ఇవ్వాలని కలెక్టర్ సంబంధిత అధికారిని ఆదేశించారు.కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ కేసులు నమోదు చేసే సమయంలో వాస్తవాలను పరిశీలించి చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులను ఆదేశించారు.. డివిఎంసీ మెంబర్  ప్రస్తావించిన అంశానికి సంబంధించి సాంఘిక సంక్షేమ భవన మరమ్మతులకు 25 లక్షల రూపాయలు నిధులను కేటాయిస్తానని ఎంపీ తెలిపారుసమావేశంలో   కర్నూలు ఆర్డీవో సందీప్, సాంఘిక సంక్షేమ అధికారి రాధిక, డివిఎంసి సభ్యులు సురేంద్ర, రవికుమార్, సురేష్, వెంకట నాగరాజు యాదవ్, మాలతి, మద్దిలేటి, కురువ మద్దిలేటి, తదితరులు పాల్గొన్నారు.

About Author