కొండపేట హై స్కూల్ లో అండర్ 14,17 విద్యార్థులకు క్రీడా పోటీలు
1 min read

చెన్నూరు ,న్యూస్ నేడు: కొండపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు అండర్ 14, 17, విద్యార్థిని, విద్యార్థులకు పాఠశాల క్రీడా పోటీలలో భాగంగా ఈనెల ఆరవ తేదీన టోర్నమెంట్ సెలక్షన్లు నిర్వహిస్తున్నట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు, సుబ్బరామయ్య, రామనపల్లె జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు ఉమామహేశ్వరులు శుక్రవారం ఒక ప్రకటనలో తెలియజేశారు.ఈ క్రీడా పోటీలలో ముఖ్యంగా అథ్లెటిక్స్, బ్యాట్మింటన్, చెస్, కబ్బడి, ఖోఖో, వాలీబాల్, యోగ వంటి క్రీడా పోటీలకు సంబంధించిన ఎంపికలు నిర్వహిస్తారని వారు తెలిపారు. ఇందులో అండర్ 14, అండర్ 17, వయసులకు సంబంధించిన విద్యార్థులు హాజరుకావాలని వారు తెలిపారు.ఈ పోటీలను ను చెన్నూర్ మండల కోర్డినేటర్, ఫీజికల్ డైరెక్టర్ లు గా రామనపల్లె జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పోలంకి గణేష్ బాబు, చిన్న మాచుపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రతాప్ రెడ్డి, చెన్నూరు జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల సుబ్బమ్మ, చెన్నూరు జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల రాజగోపాల్ లు వ్యవహరిస్తారని ఈ క్రీడలను, రామనపల్లె ప్రధానోపాధ్యాయులు, కొండపేట ప్రధాన ఉపాధ్యాయుల పర్యవేక్షణలో కొనసాగుతుందని వారు తెలియజేశారు. ఈ క్రీడా పోటీలలో మండలం లో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థినీ, విద్యార్థులు అలాగే ఉన్న ప్రైవేట్, జిల్లా పరిషత్ స్కూల్ క్రీడాకారులు వినియోగించు కోగలరని వారు తెలిపారు.

