నరసింహ నాయుడు కు పరామర్శ
1 min read
అన్నమయ్య జిల్లా(న్యూస్ నేడు ప్రతినిధి): అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గం లోని గాలివీడు పట్టణానికి చెందిన తెలుగుదేశం పార్టీ కార్యకర్త నరసింహ నాయుడు ఇటీవల స్కూటర్ ప్రమాదంలో గాయపడి చికిత్స పొంది ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్న విషయం తెలుసుకున్న రాజంపేట పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, టీటీడీ పాలకమండలి మాజీ సభ్యులు సుగవాసి ప్రసాద్ బాబు సోమవారం సాయంత్రం వారి నివాసానికి వెళ్లి మర్యాదపూర్వకంగా పరామర్శించారు.ఈ సందర్భంగా నరసింహ నాయుడు ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న ప్రసాద్ బాబు , ప్రమాదానికి సంబంధించిన వివరాలను తెలుసుకుని త్వరగా పూర్తిస్థాయిలో కోలుకుని మునుపటిలాగే ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు. వైద్యులు సూచించిన విధంగా విశ్రాంతి తీసుకుంటూ చికిత్సను కొనసాగించాలని సూచించారు.కుటుంబ సభ్యులకు ధైర్యం చెబుతూ, అవసరమైన సహాయ సహకారాల కోసం తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా కల్పించారు.ఈ సందర్భంగా సుగవాసి ప్రసాద్ బాబు మాట్లాడుతూ, “పార్టీ కోసం అంకితభావంతో పనిచేసే ప్రతి కార్యకర్త సంక్షేమం మా బాధ్యత. కార్యకర్తల కష్టసుఖాల్లో అండగా నిలవడం తెలుగుదేశం పార్టీ సంస్కృతి. వారి ఆరోగ్యం, సంక్షేమం పట్ల పార్టీ ఎల్లప్పుడూ శ్రద్ధ చూపుతుంది” అని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని నరసింహ నాయుడు త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకుని తిరిగి ప్రజాసేవలో, పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మండల టిడిపి నాయకులు, కార్యకర్తలు, సుగవాసి అభిమానులు,తదితరులు పాల్గొన్నారు.


