సౌలహళ్లి లో 50 మంది దళితులకు ప్రభుత్వ పట్టాలు ఇవ్వాలి
1 min read
లేకపోతే మా మెడలకు ఉరీ తాల్లే శరణ్యమని ధర్నా
జైభీమ్ ఎమర్పియస్ డిమాండ్
మంత్రాలయం న్యూస్ నేడు : మండల పరిధిలోని సౌలహళ్లి లో 50 మంది దళితులకు ప్రభుత్వం పట్టాలు ఇవ్వాలని జైభీమ్ ఎమర్పియస్ రాష్ట్ర అధ్యక్షులు చిక్కం జానయ్య మాదిగ, జిల్లా ప్రధాన కార్యదర్శి హనుమన్న డిమాండ్ చేశారు. మంగళవారం మంత్రాలయం లో ఆర్టిసి బస్టాండ్ ఎదురుగా జైభీమ్ ఎమర్పియస్ అధ్వర్యంలో ఉరితాళ్లు పట్టుకుని గంట సేపు ధర్నా చేశారు. దీంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సిఐ దస్తగిరి బాబు తన సిబ్బందితో వచ్చి సంప్రదింపులు జరిపి ధర్నా విరమింపజేశారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఉరి తాళ్లు పట్టుకుని నిరసన ఆందోళన చేశారు. తహసీల్దార్ కు వినతిపత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ సౌలహళ్లి గ్రామ సర్వేనెంబర్ 19 /B1A= 2.89 ఎకరాలు భూమిని 80 సంవత్సరముల క్రితం మా గ్రామ హరిజన ముత్తమ్మ W/O నరసన్న పెద్దలు ప్రభుత్వానికి కొనుగోలు చేయగా, ఈ భూమిని లక్ష్మీ W/O దేవదాసు మరియు మిగతా 49 మంది,మొత్తం 50 మంది దళితులు ఒక్కొక్కరికి సెంటున్నార అనంతరం తహసీల్దార్ రమాదేవి కంప్లైంట్ ఇప్పించారు. ఈ కార్యక్రమంలో కన్వీనర్ గుండుపోగులు డేవిడ్, జై భీమ్ ఎమ్మార్పీఎస్ మంత్రాలయం నియోజకవర్గం నాయకులు దేవరపాటి అనిల్ కుమార్ మారన్న జై భీమ్ ఎమ్మార్పీఎస్ మంత్రాల మండల అధ్యక్షులు గాడి 3 నరసింహులు జై భీమ్ ఎమ్మార్పీఎస్ మంత్రాల మండలం నాయకులు చెట్నీలు బాబు జై భీమ్ ఎమ్మార్పీఎస్ మంత్రాలయం మండల కార్యదర్శి గరిక ప్రకాష్ జై భీమ్ ఎంఆర్పిఎస్ మంత్రాల మండల అధికార ప్రతినిధి సెలవల్లి ఏసేపు జై భీమ్ ఎమ్మార్పీఎస్ మంత్రాలయం నాయకులు, జై భీమ్ ఎమ్మార్పీఎస్ సోలాలి గ్రామం నాయకులు మరియు సౌలహళ్లి గ్రామ 50 మంది దళితులు పట్టాలు పొందిన బాధితులు తదితరులు పాల్గొన్నారు.


