NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఘనంగా అంతర్జాతీయ సహకార వారోత్సవాలు

1 min read

న్యూస్ నేడు చెన్నూరు:  ఘనంగా అంతర్జాతీయ సహకార వారోత్సవాలను శుక్రవారం స్థానిక ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం కార్యాలయం నందు వ్యవసాయ పరపతి సంఘం అధ్యక్షులు ముండ్ల శ్రీనివాసులు రెడ్డి జెండా వందనం గావించి వ్యవసాయ పరపతి సంఘం సభ్యులు అధికారులచే ప్రతిజ్ఞ చేయించారు.సందర్భంగా వ్యవసాయ పరపతి సంఘం అధ్యక్షులు ముండ్ల శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ,  2025 సంవత్సరంకు గాను 72 అఖిల భారత సహకార వారోత్సవాలు చెన్నూరు ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం నందు ఘనంగా నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ సహకార వారోత్సవాలు 14/11/2025 నుండి 20/11/2025 వరకు  ఆరు రోజులపాటు నిర్వహించడం జరుగుతుందని ఆయన అన్నారు. పెద్దాయనగా పిలువబడే రైతు పక్షపాతి రాష్ట్ర ఉపాధ్యక్షుడు పుత్తా నరసింహారెడ్డి, కమలాపురం శాసనసభ్యులు పుత్తా కృష్ణ చైతన్య రెడ్డి  ఆదేశాల మేరకు రైతులకు సకాలంలో పంట రుణాలు మంజూరు చేసి వారికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించడం జరుగుతుందన్నారు. సహకార పరపతి సంఘం నందు  మండల రైతులు అందరికీ  సొసైటీ బ్యాంకు నందు దీర్ఘకాలిక రుణాలు  రైతు రుణాలు తక్కువ వడ్డీతో ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నామని రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన తెలిపారు. అంతేకాకుండా మండల రైతులకు సహకార సొసైటీ ద్వారా ఎరువులు కూడా పంపిణీ చేయడం జరుగుతుందని ఆయన రైతులకు సూచించారు.  ఈ సహకార వారోత్సవాల్లో  టిడిపి మండల అధ్యక్షులు  కల్లూరు విజయభాస్కర్ రెడ్డి,  మాజీ మార్కెట్ యార్డు చైర్మన్ ఇందిరెడ్డి శివారెడ్డి, సీఈవో గంగిరెడ్డి  టిడిపి మండల మైనార్టీ నాయకులు షబ్బీర్,అల్లాడు రాజశేఖర్ రెడ్డి   రైతులు పాల్గొనడం జరిగింది.

About Author