గంజాయి సాగు చేస్తే చట్ట ప్రకారం శిక్షలు తప్పవు
1 min read

జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి
గంజాయి తో పట్టుబడితే మూడు సంవత్సరాల వరకు జైలు శిక్ష
జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్
కర్నూలు, న్యూస్ నేడు: జిల్లాలో గంజాయి సాగుచేసినా, గంజాయితో పట్టుబడినా చట్ట ప్రకారం శిక్షలు తప్పవని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి, ఎస్.పి. విక్రాంత్ పాటిల్ హెచ్చరించారు.బుధవారం మధ్యాహ్నం కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్ లో మాదకద్రవ్యాల నియంత్రణ కు సంబంధించి జిల్లా సమన్వయ కమిటీ (ఎన్కౌర్డ్) సమావేశం జరిగింది.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అధికారుల ఉద్దేశించి మాట్లాడుతూ…జిల్లా లో ఎక్కడా గంజాయి సాగు చేయకుండా గట్టి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సచివాలయాల అగ్రికల్చర్ అసిస్టెంట్, హార్టికల్చర్ అసిస్టెంట్ లు గంజాయి సాగు పై గట్టి నిఘా ఉంచేలా చర్యలు తీసుకోవాలని, రైతు సేవా కేంద్రాలలో గంజాయి సాగు చేయడం చట్ట ప్రకారం నేరం అన్న విషయంపై రైతులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలని కలెక్టర్ జిల్లా వ్యవసాయ అధికారి వరలక్ష్మిని ఆదేశించారు.. డీఅడిక్షన్ సెంటర్ లో సిబ్బందిని నియమించేందుకు నోటిఫికేషన్ జారీ చేయాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. కర్నూలు నగరంలో ఉన్న 48 పార్కులలో లైట్లు ఏర్పాటు చేయాలని, సంకల్ బాగ్ , కల్లూరు , చిన్న బ్రిడ్జి తదితర ప్రదేశాలలో చీకటి లేకుండా, పెరిగిన చెట్లను తొలగించి వెలుతురు ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు.ఈ సమావేశానికి ఎక్సైజ్ సూపర్ ఇండెంట్ సుధీర్ బాబు , జెడి అగ్రికల్చర్ వరలక్ష్మి , ఆర్టీసీ ఆర్ఎం వెంకటేశ్వర్లు , డిఎంహెచ్వో భాస్కర్ , సీఈవో సెట్కూరు వేణుగోపాల్ , సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ రాధిక , మైనారిటీ వెల్ఫేర్ ఆఫీసర్ సబీహ పర్వీన్ , డి ఈ ఓ సుధాకర్ , లేబర్ ఆఫీసర్ వెంకటేశ్వర్లు , క్లస్టర్ యూనివర్సిటీ డీన్ అక్తర్ భాను , మెప్మా పీడీ శ్రీనివాసులు , డి వి ఈ ఓ ,మెడికల్ కాలేజ్ ప్రొఫెసర్లు, ఏ డి డ్రగ్స్ కంట్రోల్ , కర్నూలు మున్సిపల్ అధికారులు , ఈగల్ టీం సభ్యలు , కాలేజీల అధికారులు మరియు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

