NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

రైల్వే పోలీస్ బాధ్యత రహితం వలన దళితుడి కన్ను పోయింది

1 min read

విజయవాడ, న్యూస్​ నేడు : రైల్వే స్టేషన్ లో రైల్వే పోలీస్ ఎం రామారావు బాధ్యతారహితంగా ప్రవర్తించడం వలన గుంటూరు జిల్లా తెనాలి గ్రామం చెంచుపేట ప్రాంతానికి చెందిన దేవి శెట్టి జోయ్ బాబు కన్నుని కోల్పోయాడు.. ఈ సందర్భంగా విజయవాడ రైల్వే స్టేషన్ దగ్గర ఉన్న డివిజనల్ రైల్వే మేనేజర్ కార్యాలయం వద్ద బాధితుడు తల్లి దేవిశెట్టి ప్రభు జ్యోతి ,ఎమ్మార్పీఎస్ నాయకులు కార్యకర్తలు బాధితుడికి న్యాయం జరగాలంటూ నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా బాధితుడు తల్లి దేవి శెట్టి ప్రభు జ్యోతి మీడియాతో మాట్లాడుతూ నా కుమారుడు దేవి శెట్టి జోయ్ బాబు ప్రైవేట్ ఫైనాన్షి కంపెనీలో రికవరీ ఏజెంట్గా పని చేస్తున్నాడని ఉద్యోగరీత్యా రాజమండ్రి వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో విజయవాడ రైల్వే స్టేషన్ లో రైలు దిగి ప్లాట్ఫారం చివర ప్రాంగణంలో మూత్ర విసర్జన చేస్తుండగా రైల్వే పోలీస్ ఎం రామారావు దురుసుగా ప్రవర్తిస్తూ లాఠితో కొడుతూ జోయ్ బాబుని హింసించాడని తెలిపారు .జోయ్ బాబు సార్ క్షమించండి  అని బ్రతిమాలిన సరే విడిచి పెట్టకుండా బాధ్యత రహితంగా లాఠీతో జోయ్ బాబు కన్ను పై కొట్టి గాయపరిచారని తెలిపారు ఈ క్రమంలో జోయ్ బాబు సృహ  కోల్పోయాడు అక్కడికక్కడే పడిపోయాడని అయినా సరే రైల్వే పోలీస్ కనికరం లేకుండా కొట్టి హింసించారని తెలిపారు. గాయపడిన జోయ్ బాబుని ఆసుపత్రికి కూడా తరలించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారని బాధితుడు తల్లి ఆవేదన చెందింది.తన కుమారుడిని శంకర్ నేత్రాలయ ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహిస్తే అక్కడున్న నేత్రాల శాస్త్ర చికిత్స నిపుణుడు పరిశీలించి జోయ్ బాబు కన్ను పోయింది ఇక జీవితాంతం గుడ్డివాడిగానే ఉంటాడని నిర్ధారించి బాధితుడు తల్లి కి చెప్పారని తెలిపారు.ఈ విషయంపై కంప్లైంట్ ఇద్దామని రైల్వే పోలీస్ స్టేషన్లో ఉన్న ఏఎస్ఐ నాగేశ్వరావును సంప్రదించగా కేసు ఎఫ్ఐఆర్ కట్టకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారని బాధ్యత తల్లి వాపోయారు.ఈ విషయంపై విజయవాడ సత్యనారాయణ పురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగిందని బాధితుడు తల్లి తెలిపారు ..ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించిన రైల్వే పోలీస్ సిబ్బంది అయినా ఎం రామారావు ఏ ఎస్ ఐ నాగేశ్వరరావు వీరిద్దరిపై కేసు నమోదు చేసి వారి ఉద్యోగం నుండి సస్పెండ్ చేయాలని,తన కుమారుడు కన్ను పోయిగుడ్డివాడైనందువలన జోయి బాబుకి రైల్వే లో ఉద్యోగం కల్పించాలని రైల్వే పోలీస్ ఉన్నతాధికారుల్ని డివిజనల్ రైల్వే మేనేజర్ ని డిమాండ్ చేశారు.అధికారులు తక్షణమే స్పందించకపోతే తమకు న్యాయం చెయ్యకపోతే ఈ నిరసన మహాధర్నాక కొనసాగిస్తామని రైల్వే మినిస్టర్ , దేశంలో ఉన్న అత్యున్నత న్యాయస్థానం ని ఆశ్రయిస్తామని తెలిపారు..ఈ కార్యక్రమంలో గుంటూరు జిల్లా తెనాలికి చెందిన ఎమ్మార్పీఎస్ నాయకులు ధనరాజు వల్లే కిషోర్ దూర్ భాగ్యరాజు చిలకా కిరణ్ ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

About Author