కలెక్టరేట్ లో ఘనంగా విశ్వకర్మ జయంతి
1 min read

విశ్వకర్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన జిల్లా కలెక్టర్
ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్ నేడు : విశ్వకర్మను ప్రపంచంలోనే మొట్టమొదటి వాస్తు శిల్పిగా భావిస్తారని జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి పేర్కొన్నారు. విశ్వకర్మ జయంతి సందర్బంగా బుధవారం స్ధానిక కలెక్టరేట్ గౌతమీ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి,విశ్వకర్మ చిత్రపటానికి పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలన చేసి నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ విశ్వకర్మ కృష్ణుడు పరిపాలించిన పవిత్రమైన ద్వారకా నగరాన్ని,పాండవుల కోసం ఇంద్రప్రస్థ రాజభవనాన్ని నిర్మించడంతోపాటు, దేవతలకు అనేక అద్భుతమైన ఆయుధాలను తయారుచేశారన్నారు. విశ్వబ్రాహ్మణ నాయకులు తెలియజేసిన సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళతానని, సూచనలను తెలుసుకుని అవసరమైన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ వెట్రిసెల్వి తెలియజేసారు. కార్యక్రమంలో కార్యక్రమంలో జిల్లా రెవిన్యూ అధికారి వి.విశ్వేశ్వరరావు,డిఆర్డిఏ పిడి ఆర్. విజయరాజు,బి.సి. కార్పోరేషన్ ఇడి ఎన్. పుష్పలత,జిల్లా బి.సి. సంక్షేమాధికారి ఆర్.వి. నాగరాణి,సెట్వెల్ సీఈఓ ప్రభాకర్, డిఎంహెచ్ ఓ డా. పి.జె.అమృతం,ఐసిడి ఎస్. పి.డీ శారద,డీఈఓ వెంకట లక్ష్మమ్మ, ఎన్టీఆర్ ట్రస్ట్ జిల్లా అధికారి డా:రాజీవ్, విశ్వ బ్రాహ్మణ ప్రముఖులు పొట్నూరి శివరాం, ఎలబాక కృష్ణ, కేళ్ల దుర్గాప్రసాద్, కె.వి. బ్రహ్మం, తదితరులు పాల్గొన్నారు.విశ్వబ్రాహ్మణ ప్రముఖులు యాలబాక కృష్ణ, పొట్నూరి శివరావు, బొద్దూరి నాగభూషణం, అనుపోజు త్రినాథ్,కెల్లా దుర్గా ప్రసాద్, లక్కోజు వెంకటేశ్వరరావు . అద్దంకి బ్రహ్మం,పట్నాల సత్యనారాయణ, ముదునూరి వెంకట సత్యనారాయణ, ముదిన రాంబాబు,కేవీ బ్రహ్మం,తదితరులు పాల్గొన్నారు.

