రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో చిన్నారులకు ప్రత్యేక వైద్య శిబిరం
1 min read

జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ డా: ఎం.బి.ఎస్ ప్రసాద్
చిన్నారులకు,సహాయకులకు భోజనం ఏర్పాటు చేసిన తోట సత్యనారాయణ పుష్ప దంపతులు
ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్ నేడు : ఏలూరు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి ప్రాంగణంలో ఉన్న రెడ్ క్రాస్ తల సేమియా భవనంలో తల సేమియా మరియు సికిల్ సెల్ ఎనీమియా చిన్నారులకు ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహించినట్లు జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ డాక్టర్:ఎంబిఎస్వి ప్రసాద్ తెలిపారు.ఈ సందర్భంగా డాక్టర్ ప్రసాద్ మాట్లాడుతూ తల సేమియా సికిల్ సెల్ ఎనీమియా చిన్నారులకు మెరుగైన వైద్యం అందించాలనే లక్ష్యంతో ప్రతి నెల మూడవ బుధవారం విజయవాడ మమత హాస్పిటల్ నుంచి ప్రముఖ చిన్నపిల్లల వైద్య నిపుణురాలు డాక్టర్ వి.శ్రీదేవి,డాక్టర్ శ్రీనివాస్,డాక్టర్ ఆల్బర్ట్ ల ఆధ్వర్యంలో ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహిస్తున్నామని, పేషెంట్లను పరీక్షించి, అవసరమైన రక్త పరీక్షలు మరియు మందులను ఉచితంగా అందజేస్తున్నామని,పేషెంట్లు తల్లిదండ్రులకు వైద్య సలహాలు,సూచనలతో పాటు వ్యాధిపై అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. ఈరోజు 13 మంది తల సేమియా చిన్నారులకు రక్తమార్పిడి చికిత్స నిర్వహించినట్లు డాక్టర్: ప్రసాద్ తెలిపారు. ఈ సందర్భంగా తల సేమియా చిన్నారులకు వారి సహాయకులకు 120 మందికి ఉచిత భోజనం ఏర్పాటు చేసిన తోట సత్యనారాయణ, పుష్ప దంపతులకు అభినందనలు తెలిపారు.ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ వైస్ చైర్మన్ జే.సత్యనారాయణరాజు, ట్రెజరర్ ఎన్ బ్రహ్మానందం, కార్యదర్శి బెన్నీ,డాక్టర్ పి ఏ ఆర్ ఎస్ శ్రీనివాస్, డాక్టర్ ఆల్బర్ట్, కమిటీ సభ్యులు ఆలపాటి నాగేశ్వరరావు, ఎం.అజయ్ బాబు,లైన్స్ క్లబ్ ప్రెసిడెంట్ బివివి సత్యనారాయణ,సిహెచ్ విష్ణువర్ధన్ రావు తదితరులు పాల్గొన్నారు.


