1500 ఎకరాల్లో వరి పంటకు నష్టం
1 min read
మహానంది, న్యూస్ నేడు: మహానంది మండలంలో మోంథా తుఫాన్లు వరదల కారణంగా 1500 ఎకరాల్లో వరి పంట దెబ్బతిన్నట్లు మహానంది మండల వ్యవసాయ శాఖ అధికారి నాగేశ్వరరెడ్డి గురువారం పేర్కొన్నారు. మండలంలోని వివిధ గ్రామాల్లో వరి పంట దెబ్బతినిందని గ్రామాల్లోని స్థానిక వ్యవసాయ శాఖ సిబ్బంది ఫీల్డ్ లెవెల్లో పరిశీలించి నివేదికలు అందజేయడం జరిగింది అన్నారు. వీటన్నింటిని ఉన్నత స్థాయి అధికారులకు పంపడం జరిగింది అన్నారు. నష్టపోయిన రైతులకు ప్రభుత్వం అన్ని విధాలుగా ఆర్థిక సహకారాలు అందజేస్తుందని ఉన్నత స్థాయి అధికారులు కూడా చట్టపరంగా అన్ని చర్యలు తీసుకుంటున్నారని అపోహలు వీడాలని వ్యవసాయ శాఖ అధికారి నాగేశ్వర్ రెడ్డి రైతులకు సూచించారు.

