ఏలూరు జిల్లాలో ఖచ్చితత్వంతో కూడిన ఓటర్ల జాబితా రూపొందిస్తున్నాం
1 min read
రాష్ట్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ కు తెలిపిన జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: ఏలూరు జిల్లాలో ఖచ్చితత్వంతో కూడిన ఓటర్ల జాబితా రూపొందిస్తున్నామని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ కి తెలిపారు. ఓటర్ల జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం నుండి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ జిల్లా కలెక్టర్లతో గురువారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ జిల్లాలో వలసలు, ఒకటి కంటే ఎక్కువ ప్రదేశాలలో ఓటర్లు నమోదు , చనిపోయిన ఓటర్లను తొలగించకపోవడం వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించడం , వివిధ రాజకీయ పక్షాల ప్రతినిధులతో సమావేశాలు ఏర్పాటుచేసి, వారి సూచనలు, ఫిర్యాదులను తీసుకుని ఓటర్ల జాబితా స్వచ్చీకరణ కు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ మాట్లాడుతూ ఓటర్ల జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమాన్ని పటిష్టంగా నిర్వహించాలని, ఫారం-7 దరఖాస్తు పరిష్కారానికి క్షేత్రస్థాయిలో తనిఖీ చేసి ధృవీకరించుకోవాలన్నారు. ఎన్నికల ఫోటో ఓటరు గుర్తింపు కార్డులను నూరుశాతం పంపిణీకి చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా రెవిన్యూ అధికారి వి. విశ్వేశ్వరరావు, ప్రభృతులు పాల్గొన్నారు.

