NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఘనంగా బధిరుల సంకేత భాషా దినోత్సవ వేడుకలు

1 min read

విభిన్న ప్రతిభావంతులు ఆత్మస్థైర్యంతో జీవించేలా ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలి

ప్రపంచంలో ఎన్ని భాషలు ఉన్నప్పటికీ సౌoజ్ఞాలతో కూడిన భాష,భావవ్యక్తీకరణ ఉండడం చాలా గొప్ప విషయం

జిల్లా కలెక్టర్ కె.వెట్రి సెల్వి

విశేష సేవలు అందించిన స్వచ్ఛంద సేవ సంస్థల ప్రతినిధులకు కలెక్టర్ సత్కారాలు

ఏలూరు జిల్లా ప్రతినిధి న్యూస్​ నేడు  : సమాజంలో విభిన్న ప్రతిభావంతులు ఆత్మస్థైర్యం తో జీవించేలా ప్రతీ ఒక్కరూ ప్రోత్సహించాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి చెప్పారు. బధిరుల సంకేత భాషా దినోత్సవ వేడుకలు ఏలూరు కలెక్టరెట్ లోని గోదావరి సమావేశపు హాలులో మంగళవారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా కలెక్టర్  కేకును కట్ చేశారు. ఈ సందర్భంగా    ఏర్పాటుచేసిన కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా విచ్చేసిన జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ  భాష ఏదైనా భావ వ్యక్తీకరణ ప్రధానమన్నారు.ప్రపంచంలో ఎన్ని భాషలు ఉన్నప్పటికీ  విశ్వవ్యాప్తంగా బధిరులు అందరికీ  చేతి సౌంజ్ఞలతో (సైగలతో) కూడిన భాష, భావ వ్యక్తీకరణ  ఉండడం చాలా గొప్ప విషయమన్నారు.  బధిరుల జీవన ప్రమాణాలు మెరుగుపరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం పలు కార్యక్రమాలు అమలు చేస్తున్నదన్నారు. వారికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడంతోపాటు, ప్రభుత్వం సంక్షేమ పధకాలు నూరు శాతం అమలు చేస్తున్నదన్నారు. బాదితులకు  ఉచితంగా స్మార్ట్ ఫోన్లు అందిస్తున్నారన్నారు.  సమాజంలో విభిన్న ప్రతిభావంతులు  ఉత్తమ జీవన ప్రమాణాలతో జీవించేందుకు ఎన్నో  పధకాలను అమలు చేస్తున్నదని, వాటిపై వారికి అవగాహన కలిగించి అర్హులైన ప్రతీ ఒక్కరూ సద్వినియోగం చేసుకునేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. బధిరులకు కూడా ప్రభుత్వం వారి సంక్షేమం కోసం అమలు చేసే పథకాలపై వారికి అర్ధమయ్యే రీతిలో తెలియజేయాలన్నారు.  విభిన్న ప్రతిభావంతులు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువస్తే వాటికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చి వెంటనే  పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.  జిల్లా కలెక్టర్ సందేశాన్ని స్వచ్చంద సంస్థ ప్రతినిధి ఒకరు  సభలో ఉన్న బధిరులకు  అర్ధమయ్యే సౌంజ్ఞలతో (సైగలతో) తెలియజేసారు. ఈ సందర్భంగా బధిరులను  ‘ఎలా ఉన్నారు’ ‘బాగున్నారా’  ‘వెల్కమ్’ అంటూ  వారికి అర్దమయ్యేరీతిలో సౌంజ్ఞలతో (సైగలతో) కలెక్టర్ మాట్లాడారు. అందుకు వారు కూడా సౌంజ్ఞలతో సమాధానం చెప్పి కృతఙ్ఞతలు తెలియజేసారు. ఈ సందర్భంగా అర్హులైన బాదితులకు స్మార్ట్ ఫోన్ లను జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి అందించారు.బాధితుల సంక్షేమానికి విశేష సేవలు చేసిన స్వచ్చంద సంస్థల ప్రతినిధులను దుశ్శాలువా, మెమెంటోలతో సత్కరించారు. కార్యక్రమంలో జిల్లాపరిషత్ సీఈఓ శ్రీహరి,డిఆర్డిఏ పీడీ డా:విజయరాజు,విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ రామ్ కుమార్,సెట్ వెల్ సీఈఓ ప్రభాకర్, విభిన్నప్రతిభావంతుల సంక్షేమ సంఘాల ప్రతినిధులు డొమినిక్,విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.

About Author