రెవెన్యూ అధికారులు కళ్ళు మూసుకున్నారా..
1 min read

రైతుల పొలాల్లోకి సోలార్ కంచెలు
భగ్గుమన్న రైతు సంఘం నాయకులు ప్రభాకర్ రెడ్డి..
మిడుతూరు, న్యూస్ నేడు: గ్రీన్ కో సోలార్ వాళ్లు రైతుల పట్టా భూముల్లో సోలార్ కంచెలు వేస్తూ ఉంటే రెవెన్యూ అధికారులు కళ్ళు మూసుకున్నారా అని రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే ప్రభాకర్ రెడ్డి రెవెన్యూ అధికారులపై భగ్గుమన్నారు.నంద్యాల జిల్లా మిడుతూరు మండల పరిధిలోని పైపాలెం గ్రామంలో గ్రీన్ కో కంపెనీ కంపెనీ చేస్తున్న పనులను రైతులతో కలిసి మంగళవారం మధ్యాహ్నం పరిశీలించారు.రైతుల పొలాలను కాపాడేందుకు రెవెన్యూ అధికారులు ఉన్నారా లేకా గ్రీన్ కో కంపెనీకి ఊడిగం చేయడానికి రెవెన్యూ అధికారులు ఉన్నారా అని రెవెన్యూ అధికారులపై ప్రభాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.తహసిల్దార్,ఆర్డీవో మరియు యావత్తు సిబ్బంది సోలార్ తో కమ్మక్కు అయ్యారని అంతేకాకుండా కమీషన్లకు కక్కుర్తి పడి పై పాలెం గ్రామ రైతుల హక్కులను కాలరాస్తున్నారని మండిపడ్డారు.సోలార్ కంపెనీరైతుల పొలాల్లోకి దౌర్జన్యంగా కంచెలు వేస్తూ అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. వీటిపై ముఖ్యమంత్రి మరియు రెవెన్యూ శాఖ మంత్రి దృష్టికి తీసుకువెళ్తామని ఆయన అన్నారు.రైతులు ఎన్నో ఏళ్లుగా కష్టపడి సాగు చేసుకుంటున్న భూములను అంతేకాకుండా వారు వేసుకుంటున్న పంట పొలాల్లోకి సోలార్ కంపెనీ పనులు చేస్తూ ఉండటంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన మండిపడ్డారు.గ్రామంలో పొగాకు,మొక్కజొన్న,శనగ, కంది,పత్తి తదితర పంటలు సాగు చేస్తున్నారు.ప్రధానంగా 500 పశువులకు ఆవులు, పశువులకు మేత లేదని పొలాలకు వెళ్లేందుకు రస్తాలు కూడా వదలడం లేదని ఇంత జరుగుతున్నా కూడా ప్రజా ప్రతినిధులు ఎవ్వరూ కూడా రైతుల పక్షాన మద్దతు తెలపడం లేదని మండిపడ్డారు.ఈ కార్యక్రమంలో సీపీఎం పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎం నాగేశ్వరరావు,రామకృష్ణ, ఓబులేష్,లింగస్వామి, ఉస్మాన్ భాష మరియు రైతులు పాల్గొన్నారు.

