16న ప్రధానమంత్రి పర్యటన ను విజయవంతం చేయాలి
1 min read
రాష్ట్ర మంత్రులు
కర్నూలు, న్యూస్ నేడు: అక్టోబర్ 16 వ తేదీన జిల్లాలో ప్రధానమంత్రి పర్యటన ను విజయవంతం చేయాలని మంత్రులు అనగాని సత్యప్రసాద్, పయ్యావుల కేశవ్, బీసీ జనార్ధన్ రెడ్డి, టీజీ భరత్ పేర్కొన్నారు. సోమవారం నగరం లోని స్టేట్ గెస్ట్ హౌస్ లో జిల్లాలో ప్రధాన మంత్రి పర్యటనపై మంత్రులు ఉమ్మడి జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు, అధికారులు తదితరులతో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం ఫుడ్ ప్రాసెసింగ్ శాఖా మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ బహిరంగ సభ నిర్వహణలో ఎలాంటి లోపాలు ఉండకూడదని, గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని, సభను విజయవంతంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. మంత్రి అనగాని సత్య ప్రసాద్ మాట్లాడుతూ జిల్లాలో ప్రధానమంత్రి పర్యటనను ప్రతిష్టాత్మకంగా తీసుకుని విజయవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. 3 లక్షల మందితో బహిరంగ సభ నిర్వహించనున్నామని, జీఎస్టీ సంస్కరణలు, జిల్లా అభివృద్ధి గురించి సమావేశంలో వివరిస్తారన్నారు.. ముఖ్యమంత్రి కూడా ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని విజయవంతం చేయాలని ఆదేశించారని మంత్రి తెలిపారు.కార్యక్రమం విజయవంతం అయ్యేలా అధికారులకు తమ వంతు సహకారాన్ని అందిస్తామని మంత్రి పేర్కొన్నారు.రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి వర్యులు పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ ప్రధాని పర్యటన విజయవంతం అయ్యేలా ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని అధికారులను ఆదేశించారు. వేదిక, బస్సుల ఏర్పాటు తదితర అంశాలపై అధికారులకు తగిన సూచనలు చేశారు.సీఎం ప్రోగ్రాం కో ఆర్డినేటర్ మంతెన సత్యనారాయణ రాజు, టీడీపీ జిల్లా అధ్యక్షులు తిక్కా రెడ్డి, టీడీపీ పార్టీ మంత్రాలయం ఇంచార్జి రాఘవేంద్ర రెడ్డి, టీడీపీ పార్టీ ఆలూరు ఇంచార్జి జ్యోతి, వివిధ కార్పొరేషన్ డైరెక్టర్ లు,బిజెపి, జనసేన కో ఆర్డినేటర్ లు, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.


