NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

విజనరీ లీడర్ సీఎం చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రంలో అభివృద్ధి..

1 min read

రాష్ట్ర మంత్రి టి.జి భ‌ర‌త్

ఏలూరు, న్యూస్​ నేడు:  పశ్చిమగోదావరి జిల్లా తణుకు నియోజకవర్గం వేల్పూరు గ్రామంలో  సుప‌రిపాల‌న‌లో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి టి.జి భ‌ర‌త్ఇంటింటికీ తిరిగి ఏడాదిలో చేసిన సంక్షేమం, అభివృద్ధిని వివ‌రించిన మంత్రి టి.జి భ‌ర‌త్ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లాంటి విజనరీ లీడర్ నాయకత్వంలో రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి జరుగుతోందని రాష్ట్ర ప‌రిశ్ర‌మ‌లు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి భ‌ర‌త్ అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా తణుకు నియోజకవర్గం వేల్పూరు గ్రామంలో ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణతో కలిసి ఆయన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇంటింటికీ వెళ్లి ప్రజ‌ల‌తో మాట్లాడి ఏడాది పాలనలో ప్రభుత్వం చేసిన సంక్షేమం, అభివృద్ధిని వివ‌రించారు. ఏ ఏ పథకాలు అందాయని అడిగి వివరాలు తెలుసుకున్నారు. తల్లికి వందనం డబ్బులు తల్లుల అకౌంట్లో జమ చేశామని, ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నామన్నారు. త్వరలోనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలు చేస్తామని ఆయన చెప్పారు. అనంతరం మంత్రి టి.జి భరత్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలోని 175 నియోజకవర్గాలను అభివృద్ధి చేసేందుకు సీఎం చంద్రబాబు నాయుడు ప్రణాళిక బద్ధంగా ముందుకు వెళ్తున్నారన్నారు. ఏడాదిలోనే రాష్ట్రానికి లక్షల కోట్ల పెట్టబడులు వచ్చాయన్నారు. ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించే దిశలో తమ ప్రభుత్వం పని చేస్తుందన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు వయస్సును ఉద్దేశించి వైసిపి నేతలు ఇష్టానుసారంగా మాట్లాడడం బాధాకరమన్నారు. తమ పార్టీలో కిందిస్థాయి కార్యకర్త నుంచి పై నాయకులు వరకు అందరూ క్రమశిక్షణతో ఉంటారని.. వైసిపి నేతల మాదిరిగా ఇష్టం వచ్చినట్లు వ్యాఖ్యలు చేయరన్నారు. వైయస్ జగన్ వందేళ్లపాటు బ్రతకాలని తాము కోరుకుంటున్నామని.. ఎందుకంటే ఆయన ఉన్నన్ని రోజులు ప్రజలు తమ వైపే ఉంటారని, తమ ప్రభుత్వం తప్పకుండా ఇలాగే కొనసాగుతుందన్నారు. తనుకు నియోజవర్గాన్ని అభివృద్ధి చేసేందుకు ఎమ్మెల్యే అరెమిల్లి రాధాకృష్ణ ఎంతో కృషి చేస్తున్నట్లు మంత్రి టీజీ భరత్ చెప్పారు. ఈ ప్రాంతంలో ఎమ్.ఎస్. ఎమ్.ఈ పార్కు ఏర్పాటు చేసి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తామన్నారు. అంతకుముందు పలు అభివృద్ధి పనులకు మంత్రి, ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు.ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

About Author